CAREER AND COURSES ALERT FOR STUDENTS NEW COURSE FROM NEXT YEAR CANCELLATION OF OLD COURSES EVK
Career and Courses: విద్యార్థులకు అలర్ట్.. వచ్చే ఏడాది నుంచి కొత్త కోర్సు.. పాత కోర్సుల రద్దు
(ప్రతీకాత్మక చిత్రం)
Career and Courses | ఉన్నత విద్యలో ప్రభుత్వం ఎన్నో మార్పులు ప్రవేశ పెడుతుంది. తాజాగా డిగ్రీలో కొత్తగా కమర్షియల్ గార్మెంట్ టెక్న్‌టైల్ (Textile Garments Course) కోర్సును ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు.
ఉన్నత విద్యలో ప్రభుత్వం ఎన్నో మార్పులు ప్రవేశ పెడుతుంది. తాజాగా డిగ్రీలో కొత్తగా కమర్షియల్ గార్మెంట్ టెక్న్‌టైల్ (Textile Garments Course) కోర్సును ప్రవేశపెట్టాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సు అందుబాటులోకి రానున్నది. ముఖ్యంగా డిగ్రీలో సంప్రదాయక కోర్సుల రద్దుకు పలు కాలేజీలు సిద్ధపడుతున్నాయి. ఈ ఏడాది బీఏ (B.A) కోర్సు మూసివేతకు కొన్ని కాలేజీలు దరఖాస్తులు సమర్పించాయి. 2022 -23 విద్యాసంవత్సరానికి పాత కోర్సుల రద్దు, వాటి స్థానంలో కొత్త కోర్సుల (New courses) కోసం పలు కాలేజీలు ఉన్నత విద్యామండలికి దరఖాస్తులు సమర్పిస్తున్నాయి. అయితే గార్మెంట్ టెక్న్‌టైల్ కోర్సు నిర్వహణకు ఓయూ ముందుకు రాగా.. మరికొన్ని కాలేజీలు ఆసక్తి చూపుతున్నాయి.
వచ్చే ఏడాది నుంచి ఆర్ట్స్ యూనివర్సిటీ అనుబంధంగా ఒక ప్రైవేట్ కాలేజీలో ఈ కోర్సు నిర్వహించనున్నట్టు సమాచారం. రెండేండ్ల క్రితం ఇంటర్ ఒకేషనల్ కోర్సుల్లో భాగంగా గార్మెంట్ అండ్ టెక్స్‌టైల్ కోర్సును పలు ప్రభుత్వ కాలేజీ (Govt College) ల్లో ప్రవేశపెట్టారు. వీరు డిగ్రీలో చేరేందుకు వీలుగా బీఎస్సీ ఇన్ కమర్షియల్ గార్మెంట్ టెక్స్‌టైల్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టాల్సి ఉన్నది. ఈ మేరకు ఇంటర్ విద్య కమిషన్ సయ్యద్ ఉమర్ జలీల్, కళాశాల విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్‌కు లేఖ రాశారు. స్పందించిన అధికారులు ఈ కోర్సు నిర్వహణకు చర్యలు చేపట్టారు.
అంతే కాకుండా డిగ్రీ కాలేజీల్లో తెలుగు మీడియం (Telugu Medium) కోర్సులను రద్దుచేసి, ఇంగ్లిష్ మీడియం కోర్సుల వైపు కాలేజీలు చూస్తున్నట్టు అధికారులు సూత్ర్రప్రాయంగా తెలిఆరు. అంతే కాకుండా పలు కాలేజీల నుంచి బీకాం కంప్యూటర్స్ కోర్సు ఇవ్వాలని కోరుతున్నాయి. బీబీఏ (BBA), బీఎస్సీ(B.Sc) న్యూట్రిషన్ కోర్సుల కోసం కూడా కాలేజీలు దరఖాస్తులు సమర్పిస్తున్నాయి. ఇంటర్‌లో ఒకేషనల్ కోర్సులుగా ఉన్న ఫిషరీస్, ఫారెస్ట్రీ, డెయిరీ సైన్స్, సెరికల్చర్, ఆఫీస్ మేనేజ్‌మెంట్ తదితర కోర్సులను డిగ్రీలోనూ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది బీఎస్సీ ఇన్ కమర్షియల్ గార్మెంట్ టెక్స్‌టైల్ టెక్నాలజీ కోర్సు ప్రారంభం కానున్నది.
పరీక్షల ఒత్తిడి తగ్గించేందు ఫోన్ నంబర్..
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఇంటర్ ఎగ్జామ్స్ కొనసాగుతున్నాయి. ఈ రోజు ఇంటర్ సెకండియర్ మాథ్స్ బీ పేపర్ ను నిర్వహించారు అధికారులు. ప్రస్తుతం లాంగ్వేజ్ ఎగ్జామ్స్ ముగిసి మెయిన్ సబ్జెక్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ (Exams) సాగుతున్నాయి. గతంలో ఇంటర్ ఎగ్జామ్స్ సందర్భంగా అనేక మంది విద్యార్థులు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్న విషయం తెలిసిందే.
దీంతో ఇంటర్ బోర్డ్ అలాంటి విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. హెల్ప్ లైన్ నంబర్ ను ప్రారంభించింది. ఒత్తిడికి గురై ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు 180059999333 నంబర్ కు ఫోన్ చేయవచ్చు. ఫోన్ చేసిన విద్యార్థులతో సైకాలజిస్టులు మాట్లాడి వారిలో ఆత్మవిశ్వాసం నింపి మార్గనిర్దేశం చేయనున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.