హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career and Course: నిఫ్టెమ్‌లో ఇంట‌ర్ అర్హ‌త‌తో ఫుడ్ కోర్సులు.. అప్లికేష‌న్‌, కోర్సు మోడ‌ల్ వివ‌రాలు

Career and Course: నిఫ్టెమ్‌లో ఇంట‌ర్ అర్హ‌త‌తో ఫుడ్ కోర్సులు.. అప్లికేష‌న్‌, కోర్సు మోడ‌ల్ వివ‌రాలు

(నిఫ్టెమ్‌ లో ఫుడ్ కోర్సులు)

(నిఫ్టెమ్‌ లో ఫుడ్ కోర్సులు)

Career and Course | నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్‌)లో ప‌లు కోర్సుల్లో ప్రవేశాల కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇంట‌ర్ విద్యార్హ‌త‌తో ఈ కోర్సుల‌ను చేయొచ్చు.

  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్‌)లో ప‌లు కోర్సుల్లో ప్రవేశాల కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఇంట‌ర్ విద్యార్హ‌త‌తో ఈ కోర్సుల‌ను చేయొచ్చు. ఇందులో ప్ర‌వేశాల కోసం జేఈఈ మెయిన్స్‌-2022లో అభ్య‌ర్థులు అర్హ‌త సాధించి ఉండాలి. విద్యార్థుల‌ను సీఎస్‌ఏబీ నిర్వహించే కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు. బీటెక్ ఫుడ్ టెక్నాల‌జీ (Food Technology)  మాత్ర‌మే కాకుండా ఎంటెక్ చేసే అవ‌కాశం ఉంది. ఆస‌క్తిగల విద్యార్థులు ఎంబీఏ, పీహెచ్‌డీ చేసేందుకు నిఫ్టెమ్ అవ‌కాశం క‌ల్పిస్తుంది. ద‌ర‌ఖాస్తుకు ఆగ‌స్టు 8, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. మొత్తం ఈ కోర్సులో 180 సీట్లు ఉన్న‌ట్టు నోటిపికేష‌న్‌లో పేర్కొన్నారు. 5శాతం సప్లమెంటరీ సీట్లు Kashmiri migrantsకి క‌ల్పించ‌నున్నారు.

  Career and Courses: తెలుగు యూనివర్సిటీలో ఆ కోర్సుకు భ‌లే డిమాండ్‌.. బీటెక్‌, ఎంబీబీఎస్ చేసిన వారికి కూడా అవ‌కాశం

  బీటెక్‌ (ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌)

  సీట్ల సంఖ్య- 180+9*

  అర్హతలు: ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు జేఈఈ మెయిన్స్‌-2022లో అర్హత సాధించి ఉండాలి.

  ఎంపిక: సీఎస్‌ఏబీ నిర్వహించే కౌన్సెలింగ్‌ ద్వారా విద్యార్థుల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు.

  TSPSC Group-1: ఇంకాస్త స‌మ‌యం ఇవ్వండి.. గ్రూప్‌-1 ప‌రీక్ష వాయిదా వేయాలంటూ హెల్ప్‌లైన్‌ల‌కు కాల్స్!

  ఎంటెక్‌లో ప్ర‌వేశాలు..

  ఈ కోర్సులే కాకుండా ఎంటెక్ రెండేండ్ల కోర్సులో ఫుడ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ సప్లయ్‌ చైన్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌ ప్లాంట్స్‌ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్‌. అందుబాటులో ఉన్నాయి. ఇందులో అర్హ‌త సాధించేందుకు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో నాలుగేండ్లు డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

  వివిధ ప్ర‌వేశాలు..

  ఇంజినీరింగ్‌, ఎంటెక్ మాత్ర‌మే కాకుండా.. నిఫ్టెమ్ ఎంబీఏ, పీహెచ్‌డీల కోసం ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. ఫుడ్‌ అండ్‌ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, మార్కెటింగ్‌/ఫైనాన్స్‌, ఇంటర్నేషనల్‌ బిజినెస్ విభాగాల్లో రెండేళ్ల ఎంబీఏ కోర్సును అందిస్తోంది. ఇక పీహెచ్‌డీ కోర్సు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

  ద‌రఖాస్తు విధానం..

  Step 1 - ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది.

  Step 2 - ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://niftem.ac.in ను సంద‌ర్శించాలి.

  Bank Jobs: ప్ర‌ముఖ బ్యాంక్‌లో 31 మేనేజర్ ఉద్యోగాలు.. అర్హ‌త‌లు, అప్లికేష‌న్ వివ‌రాలు

  Step 3 - అనంత‌రం Admission లింక్‌లోకి వెళ్లాలి.

  Step 4 - మీరు ఎంచుకోవాలి అనుకొన్న కోర్సు నోటిఫికేష‌న్ వివ‌రాలు పూర్తిగా చ‌ద‌వాలి.

  Step 5 - నోటిఫికేష‌న్‌లో పేర్కొన్న విధంగా ద‌ర‌ఖాస్తు పూర్తి చేసుకోవాలి.

  Step 6 - ద‌ర‌ఖాస్తుల‌కు ఆగ‌స్టు 8, 2022 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Career and Courses, EDUCATION

  ఉత్తమ కథలు