హైదరాబాద్ మహానగరం మరో భారీ పెట్టుబడికి (Investments) వేధికగా మారింది. మరో ప్రముఖ సంస్థ ఇక్కడ మరో రూ.6200 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇందుకు సంబంధిచిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో (Hyderabad) కార్యకలాపాలు నిర్వహిస్తోన్న క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ (సీఎల్ఐఎన్టీ) సంస్థ రాష్ట్రంలో మరో రూ.6,200 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మొత్తంలో రూ.1,200 కోట్లతో హైదరాబాద్ మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్ టెక్‌పార్క్‌లో అత్యాధునిక డాటా సెంటర్‌ను నెలకొల్పనున్నారు. మరో 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం, 36 మెగావాట్ల విద్యుత్తు సామర్థ్యం కలిగి ఉండే ఈ ఐటీపీహెచ్ డాటా సెంటర్ ఐదేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని సంస్థ వర్గాలు తెలిపాయి. దేశంలో నేవీ ముంబై అనంతరం కంపెనీకి చెందిన రెండో డాటాసెంటర్ ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ను ఎంచుకున్నారు.
రానున్న ఐదేళ్లలో మరో రూ.5 వేల కోట్ల పెట్టుబడులతో పాటు ప్రస్తుతం హైదరాబాద్‌లో తమకు ఉన్న సుమారు 60 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ను రెట్టింపు చేస్తామని కంపెనీ వెల్లడించింది. ఈ పెట్టుబడులతో మరో 5 వేల మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఈ మేరకు సంస్థ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకుంది. ఈ వివరాలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.
తెలంగాణలో అమరరాజా సంస్థ రూ.9500 కోట్ల పెట్టుబడులు.. 4500 మందికి జాబ్స్ .. ఎక్కడంటే?
In the presence of Minister @KTRTRS, Telangana Govt. and @CapitaLand India Trust (CLINT) have signed an MoU whereby the latter is setting up a 36 MW capacity data centre in Madhapur with ₹1200 Cr investment. The 2,50,000 sq ft data centre will be operational by the end of 2024. pic.twitter.com/t5sxXb2yeN
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) December 6, 2022
క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ తెలంగాణలో భారీ పెట్టుబడులను ప్రకటించడంపై ఐటీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో రోజురోజుకు అభివృద్ధి చెందుతున్న ఐటీ పరిశ్రమల అవసరాలు ఈ డాటా సెంటర్‌తో తీరుతాయన్నారు.
రానున్న ఐదేళ్లలో హైదరాబాద్‌లోని కార్యాలయ స్థలాన్ని రెట్టింపు చేసేందుకు క్యాపిటల్యాండ్ కంపెనీ ప్రణాళికను రూపొందించుకోవడంతో హైదరాబాద్ నగరం ఐటీ, ఐటీఈఎస్ రంగాలకు అత్యంత అనుకూలమనే విషయం మరోసారి రుజువైందన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Investments, JOBS, Minister ktr, Private Jobs