Capgemini: గుడ్ న్యూస్... క్యాప్‌జెమినిలో 15,000 ఫ్రెషర్స్‌కి జాబ్స్

Capgemini Campus Recruitment | మల్టీ నేషనల్ కంపెనీలో ఫ్రెషర్‌గా ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. ప్రముఖ కంపెనీలు ఫ్రెషర్స్‌కి వరుసగా ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాయి. ఇటీవల కాగ్నిజెంట్ ఫ్రెషర్స్‌కి 20,000 ఉద్యోగాలు ప్రకటిస్తే, ఇప్పుడు క్యాప్‌జెమినీ 15,000 జాబ్స్ ప్రకటించింది.

news18-telugu
Updated: February 18, 2020, 2:57 PM IST
Capgemini: గుడ్ న్యూస్... క్యాప్‌జెమినిలో 15,000 ఫ్రెషర్స్‌కి జాబ్స్
Capgemini: గుడ్ న్యూస్... క్యాప్‌జెమినిలో 15,000 ఫ్రెషర్స్‌కి జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఫ్రాన్స్‌కు చెందిన మల్టీనేషనల్ కంపెనీ క్యాప్‌జెమినీ భారతదేశంలో భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. కాలేజ్ క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా 15,000 మంది ఫ్రెషర్స్‌కి ఉద్యోగాలను ఆఫర్ చేయనుంది. ఇటీవల కాగ్నిజెంట్ కూడా భారతదేశంలో 20,000 మంది ఫ్రెషర్స్‌కి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు... ప్రారంభ వేతనాన్ని రూ.4,00,000 చేస్తున్నట్టు కూడా కాగ్నిజెంట్ ప్రకటించడం విశేషం. ఇప్పుడు క్యాప్ జెమిని కూడా భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తుండటం నిరుద్యోగులకు గుడ్ న్యూసే. గతేడాది కూడా సుమారు 15,000 విద్యార్థులకు క్యాంపస్‌లో రిక్రూట్‌ చేసుకుంది క్యాప్‌జెమిని. ఈసారి కూడా భారీ స్థాయిలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ నిర్వహించబోతోంది. 15,000 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఎంపికైనవారికి సగటు వార్షిక వేతనం రూ.3,80,000 ఆఫర్ చేయనుంది. ఐఐటీ, ఎన్ఐటీ విద్యార్థులకు వార్షిక వేతనం రూ.6,50,000 ఉంటుంది.

ప్రస్తుతం భారతదేశంలోని క్యాప్‌జెమినీ ఆఫీసుల్లో 1.2 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫ్రెంచ్ ఐటీ సర్వీసెస్ కంపెనీ క్యాప్‌జెమినీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో సగానికి పైనే భారతదేశంలో ఉండటం విశేషం. భారతదేశం నుంచి క్యాప్‌జెమిని సాఫ్ట్‌వేర్ ఎగుమతులు కూడా ఎక్కువ. 5జీ టెక్నీలజీపై ప్రయోగాలు చేస్తున్న క్యాప్‌జెమిని ప్యారిస్, ముంబైలో రెండు ల్యాబ్స్ ఏర్పాటు చేసినట్టు కంపెనీ ఇండియా సీఈఓ అశ్విన్ యార్ది తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ISRO Jobs: ఇస్రోలో 183 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే



IIT Jobs: ఖరగ్‌పూర్ ఐఐటీలో 88 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

BSF Jobs: బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో 317 ఉద్యోగాలు... టెన్త్, ఇంటర్ అర్హత
First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు