Alert: ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు... ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్

Redmi Note 8 | ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థలు తమ కంపెనీలో ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకుంటున్నట్టైతే అది మోసంగా గుర్తించాలని క్యాప్‌జెమినీ సూచిస్తోంది.

news18-telugu
Updated: October 17, 2019, 3:29 PM IST
Alert: ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు... ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్
Alert: ఉద్యోగాల పేరుతో మోసపోవద్దు... ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
తమ కంపెనీలు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలు చేస్తున్నారని, అలాంటి ఉద్యోగ ప్రకటనల్ని నమ్మొద్దంటూ క్యాప్‌జెమినీ టెక్నాలజీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ హెచ్చరిస్తోంది. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. కొందరు వ్యక్తులు, సంస్థలు పేరుతో నకిలీ ఆఫర్ లెటర్లు సృష్టించి మోసగిస్తున్నారని, ఉద్యోగాలు వస్తాయని నమ్మించి ఫీజు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్టు క్యాప్‌జెమినీ చెబుతోంది. అంతేకాదు... క్యాప్‌జెమినీ పేరు చెప్పుకొని విద్యాసంస్థలకు వెళ్తున్నారని, ఫోన్ కాల్స్, ఇమెయిల్స్ ద్వారా అభ్యర్థుల్ని సంప్రదిస్తున్నారని, ఇలాంటి చర్యల్ని నమ్మొద్దని హెచ్చరిస్తోంది. క్యాప్‌జెమినీ పేరును ఉపయోగించుకొని నకిలీ ఇమెయిల్స్ పంపిస్తున్నారని, తమ సంస్థ నుంచి వచ్చే ఇమెయిల్స్ అన్నీ Capgemini మెయిల్ ఐడీ నుంచి ఉంటాయని, అంతే తప్ప hotmail, yahoo, gmail ఐడీల నుంచి వచ్చే మెయిల్స్ అన్నీ మోసపూరితమైనవని హెచ్చరిస్తోంది.

ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి క్యాప్‌జెమినీ ఫీజులు వసూలు చేయదని, డిపాజిట్లు స్వీకరించదని స్పష్టతనిచ్చింది. ఎవరైనా వ్యక్తులు లేదా సంస్థలు తమ కంపెనీలో ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకుంటున్నట్టైతే అది మోసంగా గుర్తించాలని క్యాప్‌జెమినీ సూచిస్తోంది. మోసగాళ్ల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటే తమ బాధ్యత లేదని, ఫేక్ ఆఫర్ లెటర్స్‌కు తమకు సంబంధం లేదని క్యాప్‌జెమినీ హెచ్చరిస్తోంది. ఎవరైనా సంస్థలో కానీ, బయటకానీ క్యాప్‌జెమినీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్టైతే తమ దృష్టికి తీసుకురావాలని, echk.in@capgemini.com మెయిల్ ఐడీకి ఫిర్యాదు చేయాలని కోరుతోంది. ఇక క్యాప్‌జెమినీలో ఖాళీల వివరాలను https://www.capgemini.com/in-en/careers/job-search/ వెబ్‌సైట్ చూడాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Redmi Note 8: రూ.9,999 ధరకే 4జీబీ+64జీబీ స్మార్ట్‌ఫోన్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Telangana Jobs: తెలంగాణ విద్యుత్ సంస్థలో 3025 ఉద్యోగాలు... పూర్తి వివరాలివేISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... మొత్తం 327 ఖాళీలు

Post Office Jobs: తెలంగాణలో 970, ఏపీలో 2707 జాబ్స్... 10వ తరగతి పాసైతే చాలు
Published by: Santhosh Kumar S
First published: October 17, 2019, 3:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading