HOME »NEWS »JOBS & EDUCATION »capgemini plans to hire 24000 people in next year ns

IT Jobs: ఆ ప్రముఖ ఐటీ కంపెనీలో 24 వేల ఉద్యోగాలు.. ఈ స్కిల్స్ ఉన్న వారికి ఛాన్స్.. వివరాలివే

IT Jobs: ఆ ప్రముఖ ఐటీ కంపెనీలో 24 వేల ఉద్యోగాలు.. ఈ స్కిల్స్ ఉన్న వారికి ఛాన్స్.. వివరాలివే
ప్రతీకాత్మక చిత్రం

Capgemini Jobs: కరోనా నేపథ్యంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయినా.. ఐటీ రంగం మాత్రంపై పెద్దగా ఆ ప్రభావం చూపలేదు. కరోనా ప్రారంభం నుంచి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించిన కంపెనీలు నియమకాలను కూడా వర్చువల్ గానే చేపడుతున్నాయి.

  • Share this:
    కరోనా నేపథ్యంలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయినా.. ఐటీ రంగం మాత్రంపై పెద్దగా ఆ ప్రభావం చూపలేదు. కరోనా ప్రారంభం నుంచి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించిన కంపెనీలు నియమకాలను కూడా వర్చువల్ గానే చేపడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ క్యాప్ జెమినీ ఈ ఏడాది భారీగా నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. రానున్న 2021లో 24 వేల మందిని నూతనంగా నియమించుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. గతేడాది కూడా దాదాపుగా ఇదే సంఖ్యలో నియామకాలను చేపట్టినట్లు కంపెనీ వెల్లడించింది. Cloud, digital, Big Data, cyber security, data science, Java, SAP, Oracle and testing తదితర విభాగాల్లో తమ క్లైంట్ల నుంచి అధిక డిమాండ్ ఉందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనిల్ సింఘ్ తెలిపారు.

    డిమాండ్ మేరకు ఆయా విభాగాల్లో స్కిల్స్ ఉన్న వారిని నియమించుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఐటీ కంపెనీ 2020 ప్రథమార్థంలో 9500 నియామకాలు చేపట్టగా, ద్వితీయార్థంలో మరో 13,500 మందిని నియమించుకుంది. తమ నియామకాలపై కరోనా ప్రభావం ఏ మాత్రం లేదని సింగ్ తెలిపారు. ఈ ఏడాది కొత్త క్యాంపస్ లను సందర్శించడంతో పాటు వర్చువల్ విధానంలో నియామకాలను చేపట్టనున్నట్లు చెప్పారు.


    ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో 800 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

    ఇదిలా ఉంటే.. లాక్ డౌన్ అనంతరం నెమ్మదిగా ప్రారంభమైన నియామకాలు ప్రస్తుతం జోరందుకున్నాయి. అయితే ప్రముఖ నిర్మాణ, ఇంజనీరింగ్ సంస్థ Larsen & Toubro (L&T) నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటించింది. మొత్తం 1100 మంది గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీలను రానున్న 2021లో నియమించుకోనున్నట్లు సంస్థ తెలిపింది. వీరికి కంపెనీలోని వివిధ వ్యాపార విభాగాల్లో బాధ్యతలు అప్పగించనున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
    Published by:Nikhil Kumar S
    First published:December 30, 2020, 17:05 IST

    टॉप स्टोरीज