Home /News /jobs /

CAPGEMINI HIRING FRESHERS UNDER EXCELLER OFF CAMPUS DRIVE CHECK ELIGIBILITY AND OTHER DETAILS GH VB

IT Jobs In Capgemini: ఫ్రెషర్లను రిక్రూట్‌ చేసుకొంటున్న క్యాప్‌జెమినీ.. అర్హతలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఫ్రెంచ్ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ (Capgemini) తన ‘ఎక్సెల్లర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్’(Exceller Off Campus Drive) ప్రోగ్రామ్ ద్వారా ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌కు మార్చి 7వ తేదీలోపు రిజిస్టర్‌ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది.

ఇంకా చదవండి ...
ఫ్రెంచ్ ఐటీ కంపెనీ క్యాప్‌జెమినీ (Capgemini) తన ‘ఎక్సెల్లర్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్’(Exceller Off Campus Drive) ప్రోగ్రామ్ ద్వారా ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్‌కు మార్చి 7వ తేదీలోపు రిజిస్టర్‌ చేసుకోవాలని కంపెనీ పేర్కొంది. రిజిస్టర్‌(Register) చేసుకొన్న అభ్యర్థులకు 2022 మార్చి 8వ తేదీ నుంచి రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.

ఎక్సెల్లర్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌కు అర్హతలు ఇవే..

ఎక్సెల్లర్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌కు అప్లై చేస్తున్న అభ్యర్థులు కచ్చితంగా 2021లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.

విద్యార్హతల వివరాలు..

MCA, BE/BTech (BE, BTechలో ఏ బ్రాంచ్‌ విద్యార్థులైనా అర్హులే)

ME/ MTech/MSc విద్యార్థులు (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ కోర్సులు చదివిన వారు మాత్రమే అర్హులు)

అభ్యర్థి డిప్లొమా, గ్రాడ్యుయేషన్ (మొత్తం 8 సెమిస్టర్లు), MCA (మొత్తం 6 సెమిస్టర్లు)/ ME/ MTech/ MScలో 50 శాతం అంతకంటే ఎక్కువ పర్సంటేజ్‌ తెచ్చుకొని ఉండాలి.

ఎక్సెల్లర్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌కు హాజరయ్యే సమయానికి విద్యార్థులకు ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదు. అన్ని సబ్జెక్టులు పాస్‌ అయి ఉండాలి.

అభ్యర్థులు ఏ ప్రాంతంలోని క్యాప్‌జెమినీ కంపెనీలో అయినా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి. ఏ టెక్నాలజీలో, డొమైన్‌లో బాధ్యతలు అప్పగించినా సిద్ధంగా ఉండాలి. కంపెనీ అవసరాల మేరకు షిఫ్టుల వారీగా పని చేసేందుకు కూడా సంసిద్ధంగా ఉండాలి. ఉద్యోగంలో చేరే ముందు అభ్యర్థులు క్యాప్‌జెమినీ సంస్థ నియమాలను అంగీకరిస్తున్నట్లు సర్వీస్‌ లెవల్‌ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.

Telangana Govt Jobs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ వచ్చేస్తున్నాయి... ఇలా రిజిస్టర్ చేసుకోండి

దేశంలోని 13 ప్రాంతాల్లోని క్యాప్‌జెమినీ సంస్థల్లో 150,000 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూర్, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, నోయిడా, పుణె, సేలం, తిరుచిరాపల్లిలో క్యాప్‌జెమినీ కంపెనీలు పని చేస్తున్నాయి.

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో పని చేసే విధానం, ఉద్యోగాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. విద్యార్హతలే కాకుండా మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న నైపుణ్యాలను సాధించడం కూడా చాలా అవసరం. ఐటీ రంగంలో రాణించాలనే లక్ష్యం, సరైన నైపుణ్యాలు, ఏ టెక్నాలజీలో అయినా పని చేయగలిగే నేర్పు ఉంటే మంచి భవిష్యత్తుకు చక్కటి వేదిక క్యాప్‌జెమినీ. అన్ని ఇంజినీరింగ్ కోర్సుల విద్యార్థులకు ఆహ్వానం పలుకుతున్నామని, ఎక్సెల్లర్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ను సద్వినియోగం చేసుకోవాలని క్యాప్‌జెమినీ కంపెనీ ఓ ప్రకటనలో సూచించింది.

నాస్కామ్‌ ఆధ్వర్యంలో జరిగిన NTFL యాన్యువల్‌ ప్రోగ్రామ్‌లో క్యాప్‌జెమినీ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఐమాన్ ఎజాట్ మాట్లాడుతూ.. ‘ భారతదేశంలోని ఐటీ ఉద్యోగులలో ఎక్కువ మంది క్యాప్‌జెమినీలో పని చేస్తున్నారు. ఇండియాలోని 3 లక్షల మంది వర్క్‌ఫోర్సులో సగం మందిని క్యాప్‌జెమినీ నియమించుకొంది. రాబోయే కొన్నేళ్లలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో భారతీయుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో ఇన్నొవేషన్‌ ల్యాబ్‌లు చాలా ఏర్పాటు చేశాం. ప్రస్తుతం ఇండియాలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, స్మార్ట్‌ ఫ్యాక్టరీ, ఇంటెలిజెంట్‌ సప్లై చైన్‌ వంటివాటిపై నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేస్తాం.’ అని వివరించారు.

ఆటో, ఏరోస్పేస్, టెలికాం రంగాలకు సంబంధించి ప్లాట్‌ఫారమ్‌లను ఏర్పాటు, నిర్వహణకు భారతదేశంలో కన్సల్టెంట్‌లను మాత్రమే కాకుండా, సెక్టార్ నిపుణులను క్యాప్‌జెమినీ నియమించిందని ఐమాన్‌ ఎజాట్‌ అన్నారు. కేవలం క్లయింట్‌లకు పనిని అందించే ప్రాంతం కాదని, బ్యాక్‌ఆఫీస్‌గా కానీ, ఆవిష్కరణల కేంద్రంగా కకానీ పనిచేయగల సత్తా భారతదేశంలో ఉందని నమ్ముతున్నామని చెప్పారు.
Published by:Veera Babu
First published:

Tags: Capgemini, Career and Courses, IT jobs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు