హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Update: అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ నుంచి కీలక ప్రకటన..

TSPSC Update: అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ నుంచి కీలక ప్రకటన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో టీఎస్పీఎస్సీ(TSPSC) ద్వారా విడుదలైన అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. దీంతో పరీక్ష షెడ్యూళ్లను(Exam Schedules) విడుదల చేస్తోంది. దీనిలో భాగంగానే 833 అసిస్టెంట్ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

తెలంగాణలో టీఎస్పీఎస్సీ(TSPSC) ద్వారా విడుదలైన అన్ని నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. దీంతో పరీక్ష షెడ్యూళ్లను(Exam Schedules) విడుదల చేస్తోంది. దీనిలో భాగంగానే 833 అసిస్టెంట్ ఇంజినీరింగ్(Assistant Engineering) ఉద్యోగాలకు నోటిఫికేషన్(Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏఈ పరీక్షకు సంబంధించి తేదీని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఫిబ్రవరి 12, 2023న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ విడుదల చేసింది. అసిస్టెంట్‌ ఇంజినీర్‌, మున్సిపల్‌ అసిస్టెంట్ ఇంజినీర్‌ పోస్టులు, టెక్నికల్‌ ఆఫీసర్‌, జూనియర్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ వంటి పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

New Job Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 957 పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ..

అభ్యర్థుల యొక్క అడ్మిట్ కార్డులను పరీక్ష జరిగే సమయాని కంటే వారం రోజుల ముందు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని టీఎస్పీఎస్సీ(TSPSC) వెబ్ నోట్ ద్వారా తెలియజేసింది. ఇప్పటికే సీడీపీఓ (CDPO) పరీక్షను జనవరి 03, 2023న, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పరీక్షను జనవరి 22, 2023న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా టీఎస్పీఎస్సీ ఏఈ పోస్టులకు సంబంధించి ఓ వెబ్ నోట్ విడుదల చేసింది. దీనిలో ఏఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దరఖాస్తులో తప్పులు చేసిన వారికి వాటిని సరిచేసుకోవడానికి టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. రేపటి నుంచి (డిసెంబర్ 03, 2022) నుంచి డిసెంబర్ 05, 2022 వరకు దరఖాస్తుల సవరణకు అవకాశం ఉంటుందని వెబ్ నోట్ లో పేర్కొంది.

అధికారిక వెబ్ సైట్ ద్వారా తమ దరఖాస్తులను సవరించుకోవచ్చని పేర్కొంది. ఎడిట్ చేసే సమయంలో అభ్యర్థులు జాగ్రత్తలు పాటించాలని.. నియామకం సమయంలో ఇదే డేటాను తుది ఎంపికలో పరిగణించబడుతుందని వెబ్ నోటీస్ లో పేర్కొన్నారు.

CLAT Admit Cards: కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అడ్మిట్ కార్డ్స్.. ఆ తేదీ నుంచి అందుబాటులోకి..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 833 పోస్టులు భర్తీ చేయబడతాయి. ఆ వివరాలిలా..

1. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మిషన్)పోస్టులు.. 62

2.అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ మిషన్)పోస్టులు.. 41

3. అసిస్టెంట్ ఇంజనీర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్)పోస్టులు.. 13

4. మునిసిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్)పోస్టులు.. 29

5. టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్)పోస్టులు.. 09

6. అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రైబల్ వెల్‌ఫేర్ డిపార్ట్‌మెంట్)పోస్టులు.. 03

7. అసిస్టెంట్ ఇంజనీర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్)పోస్టులు.. 227

8. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ (గ్రౌండ్ వాటర్)పోస్టులు.. 12

9. అసిస్టెంట్ ఇంజనీర్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్)పోస్టులు.. 38

10. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్)పోస్టులు.. 27

11. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (పంచాయత్‌రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్)పోస్టులు.. 68

12. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్, పబ్లిక్ హెల్త్)పోస్టులు.. 32

13.జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్)పోస్టులు.. 212

14. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ (ట్రాన్స్‌పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్)పోస్టులు.. 60

CTET Applications: సీటెట్ అభ్యర్థులకు అలర్ట్.. రేపటితో ఆ గడువు ముగింపు..

దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో మాత్రమే పంపించాలి.

జీతం..అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు నెలకు రూ. 45,960 నుంచి రూ. 1,24,150 వరకు చెల్లిస్తారు. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు నెలకు రూ. 32,810 నుంచి రూ.96,890 మధ్య చెల్లిస్తారు.

First published:

Tags: JOBS, TSPSC

ఉత్తమ కథలు