(K. Veeranna, News 18, Medak)
తెలంగాణ పోలీస్ పరీక్షల(Telangana Police Exams) సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎస్సై, కానిస్టేబుల్ శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు(Students) కష్టపడి చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చని అర్థిమేటిక్(Arithmetic) అధ్యాపకులు శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana Government) పోలీస్ ఉద్యోగాల కొలువులకు ఉచిత ట్రైనింగ్ ఇస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రవేట్ ఇనిస్టిట్యూట్లో లక్షలు పెట్టి కోచింగ్ తీసుకునే బదులు.. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇక ఈ కొలువులు సాధించాలంటే.. పరీక్షలో ఎలాంటి మెళకువలు పాటించాలి.. ఎలా చదివితే ఉద్యోగం సాధించవచ్చనే వాటిని విద్యార్థులకు సూచించారు. వాటిని ఇక్కడ తెలుసుకుందాం.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవన్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సై కానిస్టేబుల్ ఉచిత ట్రైనింగ్ ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో శ్రీనివాస్ ఎస్సై కానిస్టేబుల్ పరీక్షలు రాసేటప్పుడు ట్రిప్స్ ఎలా టచ్ చేయలే . పరీక్షలలో ఏ సబ్జెక్టులకు సంబంధించి ఎన్ని మార్కులు వస్తాయో విద్యార్థులకు వివరించారు. ఎస్సై ఆగస్టు 7వ తేదీన పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణలోని కానిస్టేబుల్ పరీక్షలను ఆగస్టు 21న నిర్వహించనున్నారు. ఎస్సై పరీక్షల్లో అర్థమెటిక్స్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటి జియోగ్రఫీ, కెమిస్ట్రీ, తెలంగాణ మూమెంట్ , విపత్తుల నుండి 200 మార్కులు వస్తాయి.
మూడు గంటలలో పరీక్ష పూర్తి చేయాలి. కానిస్టేబుల్స్ పరీక్షలు ఆగస్టు 21వ తేదీన అధికారులు నిర్వహించనున్నారు. ఈవెంట్స్ కు అర్హత సాధించాలంటే.. ప్రిలిమ్స్ ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల్లో 60 మార్కులు వస్తే సరిపోతుంది. 30 శాతం మాత్రమే క్వాలిఫైడ్ మార్క్స్ గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎస్సై ప్రిలిమ్స్ లో ఆర్థమెటిక్స్ 100 మార్కులు ఉంటుంది కాబట్టి ఆర్థమెటిక్స్ సబ్జెక్టుపై ఎక్కువ దృష్టి పెడితే సరిపోతుంది.
నెగిటివ్ మార్కులు మార్కులు కూడా ఉంటాయి కాబట్టి రాని వాటిని వదిలిపెడితే చాలు కానిస్టేబుల్, ఎస్సై పరీక్షల్లో పాస్ అవుతారు. అర్థమెటిక్స్, రీజనింగ్, తెలంగాణ మూమెంట్, హిస్టరీ ఈ నాలుగు సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి పెడితే పరీక్షల్లో ఈజీ మెథడ్ గా పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పరీక్షలో ముందుగా బాగా వచ్చిన వాటిని సమాధానాలను గుర్తిస్తూ వెళ్లండి. రాని వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది. చివర్లో ఏమైనా సమయం ఉంటే.. ఆలోచించి వాటికి సమాధానాలు రాయండి. ఈ రకంగా చేస్తే ప్రిలిమ్స్ లో అర్హత సాధించడం అంత పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Police jobs, Preparation, Telangana