Home /News /jobs /

CANDIDATES WHO ARE PREPARING FOR POLICE EXAMS CAN ACHIEVE SUCCESS IF THEY FOLLOW THESE TIPS MBNR VB

Police Events Tips: పోలీస్ కొలువు.. ఇలాంటి సాధనతో సులువు.. నిరంతం గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్న యువత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పోలీసు(Police) కొలువు లక్ష్యం సాధనకు యువత సన్నద్ధం అవుతున్నారు. ఈ కొలువుకు ముఖ్యంగా కావాల్సింది రాతపరీక్షతోపాటు దేహదారుడ్యాం కూడా. దీంతో ఫిట్నెస్ దేహదారుడ్యాం పెంచుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అన్ని మైదానాల్లో వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ( Syed Rafi, News 18, Mahabubnagar )

    పోలీసు(Police) కొలువు లక్ష్యం సాధనకు యువత సన్నద్ధం అవుతున్నారు. ఈ కొలువుకు ముఖ్యంగా కావాల్సింది రాతపరీక్షతోపాటు దేహదారుడ్యాం కూడా. దీంతో ఫిట్నెస్ దేహదారుడ్యాం పెంచుకోవడానికి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అన్ని మైదానాల్లో వ్యాయామం చేస్తూ కనిపిస్తున్నారు. పరుగుతో పాటు లాంగ్, జంప్ షాట్ పుట్ తదితర అర్హత పరీక్షల్లో నెగ్గడానికి కసరత్తు చేస్తున్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా ఉంచిన ఉచిత శిక్షణ(Free Coaching) ఇస్తుండటంతో.. పలువురు దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా క్రీడా మైదానాలు అభ్యర్థులతో కళకలాడుతున్నాయి. మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో వేలాది మంది అభ్యర్థులు పోలీసు ఉద్యోగ సాధనకు శ్రమిస్తున్నారు. ఈ సారి 1600 మీటర్ల పరుగు పందెం కొత్తగా తీసుకొచ్చారు. దీనిని గెయిన్ చేయాలంటే.. ప్రాక్టీస్ (Practice) ఎక్కువగా చేయాలి. షార్ట్ ఫుట్(Shotput), లాంగ్ జంప్ (Long Jump) లాంటివి రోజూ గ్రౌండ్ లో మెత్తటి ప్రదేశం వద్ద ప్రాక్టీస్ చేస్తే.. ఈవెంట్స్ పెద్ద కష్టమేం కాదు.

    IBPS Reasoning Tips: బ్యాంక్ పరీక్షలో స్కోరింగ్ టాపిక్ ‘రీజనింగ్’.. తక్కువ సమయంలో ఎలా చేయాలో తెలుసుకోండి..


    ఉమ్మడి పాలమూరు జిల్లాలో 746 పోస్టులున్నాయి. 2019లో పోలీస్ శాఖ 300 పోస్టులను భర్తీ చేసింది. ఈసారి ఏకంగా 746 పోస్టులు భర్తీ చేయనున్నారు. అందులో 524 సివిల్ కానిస్టేబుల్స్ కాగా మరు 222 ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. వాటితో పాటు జోగులాంబ గద్వాల జోన్ ఏడు పరిధిలో 31 ఎస్సై పోస్టులను భర్తీ చేస్తున్నారు.. అందులో 26 పోస్టులు సివిల్ ఎస్సైలు కాగా ఐదు పోస్టులు ఏఆర్ ఎస్సైలు ఉన్నాయి. మరో రెండు అగ్నిమాపక శాఖ ఎస్సై పోస్టులు ఉన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో భర్తీ చేనున్న పోలీస్ ఉద్యోగాలు వివరాలు..మహబూబ్నగర్ 202, నాగర్ కర్నూల్ 195, వనపర్తి 131, జోగులాంబ గద్వాల 118, నారాయణపేట 100 పోస్టులు కేటాయించడం జరిగింది.



    పోలీసులు కోసం తాను మొదటిసారి సన్నద్ధం అవుతున్నట్లు వరలక్ష్మి అనే యువతి చెప్పింది. ప్రతీ రోజు తాను మైదానానికి వస్తున్నానని.. మొదటి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించాలని శ్రమిస్తున్నానని.. శారీరక సామర్థ్య పరీక్షలతో పాటు రాత పరీక్ష కోసం కూడా పుస్తకాలతో కుస్తీ పడుతున్నానని.. శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు పేర్కొంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పోటీ పడుతున్నా.. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తానన్నా నమ్మకం తనలో ఉందంటూ చెప్పింది. ప్రతీ రోజు వార్తా పత్రికలను చదువుతున్నట్లు.. పోలీస్ వారు ఇచ్చే కోచింగ్ ను సద్వినియోగం చేసుకుంటున్నట్లు తెలిపారు.

    SA Preparation Tips: ఉపాధ్యాయ కొలువు సాధించాలంటే.. ఈ పుస్తకాలను చదివేయండి.. కొలువు పక్కా..!


    నాపై కుటుంబ సభ్యులు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు వారి నమ్మకాన్ని నిజం చేయాలని పట్టుదలతో కృషి చేస్తున్నాను.. తప్పకుండా పోలీస్ ఉద్యోగం సాధించి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటానని పోలీసు ఉద్యోగాల కోసం ఎంతమంది పోటీ పడినా.. ఎన్ని పోస్టులు ఉన్నా.. కేవలం ఒక్క పోస్టు ఉందనే పోటీపడుతా అంటూ ఓ పోలీస్ అభ్యర్థి చెప్పుకొచ్చాడు. ఆ దిశగానే పట్టుదలతో రోజు కష్టపడుతానన్నాడు.

    తొలిసారిగా కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేశా.. మొదటి ప్రయత్నంలోనే లక్ష్యం సాధించాలని పట్టుదలతో ఉన్నాను.. రాత పరీక్షకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాను.. శారీరక సామర్థ్యం పెంచుకోవడానికి రోజు మైదానానికి వెళుతున్నాను అంటూ ఓ మహిళా కానిస్టుబుల్ అభ్యర్థి చెప్పారు. పరుగు లాంగ్ జంప్ షాట్ పుట్ తదితర వాటిలో రాణించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు. ఖుషి, పట్టుదల తో సాధించాలని ఉద్దేశంతో శ్రమిస్తున్న వారికి .. వారి కలలు నిజం కావాలని కోరుతోంది న్యూస్ 18.
    Published by:Veera Babu
    First published:

    Tags: Career and Courses, JOBS, Mahabubnagar, Police jobs, Preparation

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు