Good News: ఇక బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగులోనూ రాయొచ్చు

Banking Exams | ఐబీపీఎస్ నిర్వహించే రీజనల్ రూరల్ బ్యాంక్స్-RRB పరీక్షల్ని ఇంగ్లీష్, హిందీతో పాటు 13 భాషల్లో రాయొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

news18-telugu
Updated: July 4, 2019, 2:22 PM IST
Good News: ఇక బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగులోనూ రాయొచ్చు
Good News: ఇక బ్యాంకింగ్ ఎగ్జామ్స్ తెలుగులోనూ రాయొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 4, 2019, 2:22 PM IST
మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు శుభవార్త. ఇకపై బ్యాంక్ ఎగ్జామ్స్ తెలుగులో కూడా రాయొచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్ లేదా హిందీ మాధ్యమాల్లోనే బ్యాంకు పరీక్షల్ని నిర్వహిస్తోంది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS. ఇప్పటివరకు వచ్చిన నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఇంగ్లీష్ లేదా హిందీ భాష మాత్రమే ఎంచుకునే అవకాశం ఉండేది. అయితే మాతృభాషల్లో చదువుకున్న విద్యార్థులు ఇంగ్లీష్, హిందీ మీడియంలో పరీక్షలు సరిగ్గా రాయలేకపోతున్నారు. దీంతో తమకు అన్యాయం జరుగుతోందన్న భావన విద్యార్థుల్లో నెలకొంది. అందుకే బ్యాంకింగ్ పరీక్షలు స్థానిక భాషల్లో నిర్వహించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇదే విషయాన్ని కొద్దిరోజుల క్రితం ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావించారు. ఇండియన్ బ్యాంకింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్‌తో పాటు ఇతర పరీక్షల్ని స్థానిక భాషల్లో రాసే అవకాశం కల్పించాలని కోరారు. ఎంపీల డిమాండ్‌కు స్పందించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్... విద్యార్థులు తమ మాతృభాషలో బ్యాంకింగ్ పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు గురువారం ప్రకటించారు.


ఐబీపీఎస్ నిర్వహించే రీజనల్ రూరల్ బ్యాంక్స్-RRB పరీక్షల్ని ఇంగ్లీష్, హిందీతో పాటు 13 భాషల్లో రాయొచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్‌లో ఎకనమిక్ సర్వే 2018-19 ప్రవేశపెట్టే సమయంలో ఈ శుభవార్త చెప్పారు. ఇకపై తెలుగుతో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, కొంకణి, మళయాళం, మణిపురి, మరాఠీ, ఒరియా, పంజాబీ, ఉర్దూ, తమిళ్ భాషల్లో ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలు రాయొచ్చు. అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడం, పోటీ పరీక్షలు రాసేలా యువతను ప్రోత్సహించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. స్కేల్-1 ఆఫీసర్ల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో పాటు ఆర్ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలు రాసే విద్యార్థులు ఇంగ్లీష్, హిందీతో పాటు 13 స్థానిక భాషల్లో ఏదైనా ఎంచుకోవచ్చు.



Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Loading...
Redmi 7A: రూ.5,799 ధరకే రెడ్‌మీ 7ఏ... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Jobs: సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో మేనేజర్ ఉద్యోగాలు

Jobs: ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా...

Army Jobs: ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా
First published: July 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...