హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Fact Check: ఆ యూనివర్సిటీలకు UGC గుర్తింపు రద్దు నిజమేనా?

Fact Check: ఆ యూనివర్సిటీలకు UGC గుర్తింపు రద్దు నిజమేనా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fact Check: ఇటీవల యూజీసీ దేశంలోని 24 యూనివర్సిటీలను ఫేక్ గా గుర్తిస్తూ ఓ ప్రకటన చేసిందన్న వార్త ఇంటర్ నెట్లో హల్ చల్ చేసింది. అందుకు సంబంధించిన ఓ ప్రకటన కాపీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే అనేక మందికి ఈ వార్తపై అనుమానం వ్యక్తమైంది. ఇది నిజమా? కాదా? అన్న విషయంపై PIB Fact Check క్లారిటీ ఇచ్చింది.

ఇంకా చదవండి ...

సోషల్ మీడియాలో నిత్యం అనేక ఫేక్ వార్తలు ప్రజలను గందరగోళానికి గురి చేస్తుంటాయి. తప్పుడు సమాచారం, ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు సృష్టించే వారు అధికమయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రకటనలు, పథకాలు, స్కాలర్ షిప్ లు ఉద్యోగ ప్రకటనలు తదితర అంశాలపై ఫేక్ వార్తలు అధికంగా ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. దీంతో రాను రాను ప్రజలకు సోషల్ మీడియాలో వచ్చే వార్తలు సరైనవా? కాదా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. నిజమైన వార్తలు కూడా నమ్మలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల యూజీసీ 24 యూనివర్సిటీలను ఫేక్ గా గుర్తిస్తూ ఓ ప్రకటన చేసిందన్న వార్త ఇంటర్ నెట్లో హల్ చల్ చేసింది.

అందుకు సంబంధించిన ఓ ప్రకటన కాపీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. అయితే అనేక మందికి ఈ వార్తపై అనుమానం వ్యక్తమైంది. ఎవరైనా కావాలనే ఇలా తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తున్నారా అన్న సందేహాలు అనేక మందిలో కనిపించాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాలసీలు, స్కీంలు ఇతర సమాచారం విషయంలో సర్క్యలేట్ అయ్యే తప్పుడు సమాచారాన్ని ఎప్పటికప్పుడు బయట పెట్టే PIB Fact Check ఈ వార్తపై స్పందించింది. 24 యూనివర్సిటీలు ఫేక్ అంటూ యూజీసీ ప్రకటన విడుదల చేసిన విషయం వాస్తవమేనని తేల్చింది. ఆ 24 యూనివర్సిటీలు యూజీసీ చట్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాయని తేల్చి చెప్పింది. ఆ యునివర్సిటీలకు ఎలాంటి డిగ్రీలు ఇచ్చే అధికారం లేదని యూజీసీ చెప్పిన విషయం నిజమేనని స్పష్టం చేసింది.

First published:

Tags: Fact Check, Fake news

ఉత్తమ కథలు