బ్యాంకు ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. కెనెరా బ్యాంకు పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్, బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 220 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 నవంబర్ 25న ప్రారంభం కానుంది. దరఖాస్తుకు 2020 డిసెంబర్ 15 చివరి తేదీ. అభ్యర్థులకు 2021 జనవరి లేదా ఫిబ్రవరిలో రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://canarabank.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి.
Canara Bank SO Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
బ్యాకప్ అడ్మినిస్ట్రేటర్- 4
ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫామ్ అండ్ లోడ్ స్పెషలిస్ట్- 5
బీఐ స్పెషలిస్ట్- 5
యాంటీవైరస్ అడ్మినిస్ట్రేటర్- 5
నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్- 10డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్- 12
డెవలపర్ లేదా ప్రోగ్రామర్- 25
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 21
ఎస్ఓసీ అనలిస్ట్- 4
మేనేజర్స్ లా- 43
కాస్ట్ అకౌంటెంట్- 1
ఛార్టర్డ్ అకౌంటెంట్- 20
మేనేజర్ ఫైనాన్స్- 21
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్- 4
ఎథికల్ హ్యాకర్స్ అండ్ పెనెట్రేషన్ టెస్టర్స్- 2
సైబర్ ఫోరెన్సిక్ అనలిస్ట్- 2
డేటా మైనింగ్ ఎక్స్పర్ట్- 2
OFSAA అడ్మినిస్ట్రేటర్- 2
OFSS టెక్నో ఫంక్షనల్- 5
బేస్ 25 అడ్మినిస్ట్రేటర్- 2
స్టోరేజ్ అడ్మినిస్ట్రేటర్- 4
మిడిల్‌వేర్ అడ్మినిస్ట్రేటర్- 5
డేటా అనలిస్ట్- 2
మేనేజర్- 13
సీనియర్ మేనేజర్- 1
RITES Recruitment 2020: రైల్వే సంస్థలో 170 జాబ్స్... దరఖాస్తుకు 2 రోజులే గడువు
NTPC Recruitment 2020: ఎన్టీపీసీలో ఉద్యోగాలు... రూ.24,000 వేతనం
Canara Bank SO Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తు ప్రారంభం- 2020 నవంబర్ 25
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 డిసెంబర్ 15
ఆన్లైన్ టెస్ట్- 2021 జనవరి లేదా ఫిబ్రవరి
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. సంబంధిత సబ్జెక్ట్‌లో డిగ్రీతో పాటు కంప్యూటర్స్ నాలెడ్జ్ ఉండాలి. హిందీ భాష తెలిసి ఉండాలి.
దరఖాస్తు ఫీజు- రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100.
ఎంపిక విధానం- ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ.
SBI Jobs 2020: డిగ్రీ అర్హతతో ఎస్బీఐలో 8500 అప్రెంటీస్ పోస్టులు... అప్లై చేయండి ఇలా
DRDO Scholarship: విద్యార్థులకు రూ.1,86,000 స్కాలర్షిప్... దరఖాస్తుకు డిసెంబర్ 31 వరకు గడువు
Canara Bank SO Recruitment 2020: అప్లై చేయండి ఇలా
అన్ని విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://canarabank.com/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Careers లింక్ పైన క్లిక్ చేయాలి. Recruitment పైన క్లిక్ చేస్తే Recruitment Project – 2/2020 – Specialist Officers and Special Recruitment Drive under ST Category నోటిఫికేషన్ కనిపిస్తుంది.
లింక్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి.
పేరు, పుట్టిన తేదీ, ఇతర వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి.
ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
అన్ని వివరాలు మరోసారి సరిచూసుకొని అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.