Home /News /jobs /

CANARA BANK SO RECRUITMENT 2020 NOTIFICATION RELEASED APPLY FROM NOV 25 NS

Canara Bank Recruitment 2020: కెనరా బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నిరుద్యోగులకు కెనరా బ్యాంకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.canarabank.com లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

ఇంకా చదవండి ...
    నిరుద్యోగులకు కెనరా బ్యాంకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కేల్1, స్కేల్2 స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం ఈ నియామకాన్ని చేపట్టారు. షెడ్యూల్డ్ ట్రైబ్ కేటగిరీలో స్కేల్2, స్కేల్3 ఉద్యోగాల భర్తీకి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. మొత్తం 21 విభాగాల్లో 220 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు కెనరా బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.canarabank.com లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వేతనాలు పోస్టు ఆధారంగా రూ. 23,700 నుంచి రూ.51,490 వరకు చెల్లించనున్నారు. ఒక అభ్యర్థి కేవలం ఒకే పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థి ఆన్లైన్లో పరీక్ష ఫీజును డిపాజిట్ చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అభ్యర్థులు ఇతర వివరాలను నోటిఫికేషన్లో చూడవచ్చు.
    Notification-Direct Link

    ముఖ్యమైన తేదీలు:
    అప్లికేషన్ల స్వీకరణకు ప్రారంభ తేదీ: నవంబర్ 25
    అప్లికేషన్ల స్వీకరణకు ఆఖరి తేదీ: డిసెంబర్ 15
    పరీక్ష ఫీజు:
    SC/ST/PWBD అభ్యర్థులకు-రూ. 100+GST, ఇతర అభ్యర్థులకు-రూ. 600+GST

    డిగ్రీ పాసయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI డిగ్రీ అర్హతతో మొత్తం 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. డిగ్రీ అర్హతతో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎస్‌బీఐ. ఏదైనా డిగ్రీ పాసైనవారు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. దరఖాస్తు చేయడానికి డిసెంబర్ 4 వరకు అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ వివరాలను https://bank.sbi/web/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్స్‌లో తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్‌లోనే ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి వివరించింది ఎస్‌బీఐ. మూడు అంచెల పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Canara Bank, JOBS

    తదుపరి వార్తలు