కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో(Canara Bank Securities Limited) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు(Applications) కోరుతోంది. డిప్యూటీ మేనేజర్(Deputy Manager), అసిస్టెంట్ మేనేజర్ తో(Assistant Manager) సహా మొత్తం 14 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులు బెంగుళూరు(Bangalore) మరియు ముంబైలలో(Mumbai) ఖాళీగా ఉన్నాయి. అర్హత, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణ ఆఫ్‌లైన్ ద్వారా చేయాలి. దీనికి చివరి తేదీ సెప్టెంబర్ 5. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, వేతనాలు, ఎంపిక విధానం మొదలైన ఈ నియామకానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారం కింద తెలుసుకుందాం..
బ్యాంక్ పేరు: కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్
పోస్ట్ పేరు: డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల
మొత్తం పోస్టుల సంఖ్య: 14
ఉద్యోగ స్థలం: బెంగళూరు - ముంబై
జీతం: నెలకు రూ. 21200-37000
వయో పరిమితి.. అసిస్టెంట్ మేనేజర్ - బ్యాక్ ఆఫీస్, అసిస్టెంట్ మేనేజర్ - IT డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థి యొక్క వయస్సు 22 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
వయస్సు సడలింపు:
OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితి సడలింపు ఉంటుంది.
దరఖాస్తు సమర్పణ: ఆఫ్‌లైన్
ఎంపిక ప్రక్రియ
షార్ట్‌లిస్ట్ మరియు ఇంటర్వ్యూ
ముఖ్యమైన తేదీలు:
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 24 ఆగస్టు 2022
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 05 సెప్టెంబర్ 2022
నోటిఫికేషన్ ముఖ్యమైన లింక్‌లు
అధికారిక నోటిఫికేషన్ PDF: ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్‌సైట్: canmoney.in
దరఖాస్తు సమర్పణ చిరునామా:
జనరల్ మేనేజర్, హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్, కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, 7వ అంతస్తు, మేకర్ ఛాంబర్ III నారిమన్ పాయింట్, ముంబై - 400021
దరఖాస్తు సమర్పణ ప్రక్రియ ఇలా..
-ముందుగా అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ నుండి దరఖాస్తు ఫారమ్‌లో ఫారమ్‌ను పూరించాలి. దానిని డౌన్ లోడ్ చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
-వివరాలను నమోదు చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అప్లికేషన్ ఫారమ్ తో జత పరచాలి.
-మొత్తం సమాచారాన్ని పూర్తి చేసిన తర్వాత.. అందించిన వివరాలు సరైనవో కాదో తనిఖీ చేసుకోవాలి. ఆపై మీ దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా పైన పేర్కొన్న చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 5.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank Jobs, Bank news, Canara Bank, Career and Courses, JOBS