హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Immigration Frauds: కెనడాలో ఇండియన్ స్టూడెంట్స్‌కు షాక్‌.. బహిష్కరణ నోటీసులు.. ఏం జరిగిందంటే!

Immigration Frauds: కెనడాలో ఇండియన్ స్టూడెంట్స్‌కు షాక్‌.. బహిష్కరణ నోటీసులు.. ఏం జరిగిందంటే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Immigration Frauds: విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లేవారు ఏజెంట్స్‌తో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవు. అక్కడ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు కూడా ఇప్పిస్తామని ఏజెన్సీలు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మితే మోసపోవాల్సి ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బయటపడింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

విదేశాల్లో ఉన్నత విద్య (Higher Education) కోసం వెళ్లేవారు ఏజెంట్స్‌తో జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు తప్పవు. అక్కడ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు (Jobs) కూడా ఇప్పిస్తామని ఏజెన్సీలు చెప్పే మాటలు గుడ్డిగా నమ్మితే మోసపోవాల్సి ఉంటుంది. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి బయటపడింది. కెనడా (Canada)లో ఉన్నత చదువులు చదివి, అక్కడే మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనుకున్న 700 మంది భారతీయ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వారి దగ్గరున్న వీసాలు, అడ్మిషన్‌ ఆఫర్‌ లెటర్లు, ఇతర డాక్యుమెంట్స్ నకిలీవని అక్కడి అధికారులు గుర్తించారు. కెనడియన్ బోర్డర్ సెక్యూరిటీ ఏజెన్సీ (CBSA) నుంచి బహిష్కరణ నోటీసులు అందడంతో ఏం చేయాలో దిక్కుతెలియని పరిస్థితిలో ఉన్నారు. అసలు ఏం జరిగిందంటే..

టొరంటో నుంచి చమన్‌ సింగ్‌ బాత్‌ అనే విద్యార్థి indianarrative.com తో మాట్లాడటం ద్వారా ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది. అసలు కథలోకి వెళ్తే.. 700 మంది విద్యార్థులు ప్లస్ టు పూర్తయిన తర్వాత ఎడ్యుకేషన్ మైగ్రేషన్ సర్వీసెస్ ద్వారా యూకే స్టడీ వీసా కోసం అప్లై చేసుకున్నారు.

దీన్ని జలంధర్‌కు చెందిన బ్రిజేష్ మిశ్రా అనే వ్యక్తి నడిపిస్తున్నాడు. హంబర్‌ కాలేజీలో అడ్మిషన్‌, ఇతర ఖర్చుల కోసం ఒక్కొక్కరి నుంచి రూ.16 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు బ్రిజేష్‌ మిశ్రా తీసుకున్నాడు. వీటితో పాటు ఫ్లైట్‌ టికెట్లు, సెక్యూరిటీ డిపాజిట్, ఏజెంట్‌ కమీషన్‌ కోసం అదనంగా వసూలు చేశాడు. ఆ తర్వాత విద్యార్థులంతా టొరంటో వెళ్లారు.

* వెళ్లిన తర్వాత షాక్‌

అక్కడికి వెళ్లిన తర్వాత హంబర్ కాలేజీలో సీట్లు అన్నీ పూర్తి అయిపోయానని, మరో ఏడాది వేచిచూడాలని విద్యార్థులకు అధికారులు చెప్పారు. దీంతో వారంతా షాక్‌ అయ్యారు. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు. ఆ సమయంలో బ్రిజేష్‌ మిశ్రా.. విద్యార్థులు కట్టిన కాలేజీ ఫీజును వారికి తిరిగిచ్చేశాడు. అతడే వారికి వేరే కాలేజీ నుంచి డిప్లొమా కోర్సు చేసేందుకు అవకాశం కల్పించాడు. కోర్సు పూర్తయిన తర్వాత వర్క్ పర్మిట్స్ కూడా దొరుకుతాయని నమ్మించాడు. దీంతో అతనిపై ఎవరికీ అనుమానం రాలేదు.

* వెలుగులోకి వచ్చిందిలా

2018- 2022 మధ్య వెళ్లిన వీరంతా డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. అందులో కొందరు వర్క్‌ పర్మిట్‌ కూడా పొందారు. కెనడాలో శాశ్వత నివాసం కోసం ఇమ్మిగ్రెంట్‌ అధికారులకు తమ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఇచ్చారు. వాటిని పరిశీలించిన సీబీఎస్ఏ.. అవన్నీ నకిలీవని చెప్పడంతో అసలు విషయం బయటపడింది. తర్వాత ఈ 700 మందికి బహిష్కరణ నోటీసులు జారీ చేసింది. దీంతో వారంతా షాక్‌ అయ్యారు.

ఇది కూడా చదవండి : ఇంటర్ తర్వాత బెస్ట్ కెరీర్ ఆప్షన్స్ ఇవే.. ఈ రంగాల్లో మంచి ఉద్యోగాలు..

* అంతా కావాలనే

ఈ మొత్తం వ్యవహారంలో డాక్యుమెంట్లపరంగా ఎక్కడా దొరక్కుండా బ్రిజేశ్‌ మిశ్రా చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. జలంధర్‌లోని మిశ్రా ఆఫీసుకు కొన్ని రోజులుగా తాళం వేసి ఉంటోంది. ఇదంతా అతడు కావాలనే చేశాడని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాము మోసపోయామని, తమ బహిష్కరణలను రద్దు చేయాలని కోర్టును ఆశ్రయించడమే వారికున్న ఏకైక మార్గం. అయితే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఏజెంట్ల బ్యాక్‌గ్రౌండ్‌ తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.

First published:

Tags: Canada, Career and Courses, EDUCATION, JOBS

ఉత్తమ కథలు