హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Canada Visa: కెనడా స్టూడెంట్ వీసాలు మరింత ఆలస్యం.. భారతీయ విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలివే..

Canada Visa: కెనడా స్టూడెంట్ వీసాలు మరింత ఆలస్యం.. భారతీయ విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Canada Visa: వీసా జారీలో ఆలస్యం కావడంతో కెనడియన్ యూనివర్సిటీలు, కాలేజీల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

విదేశాల్లో ఉన్నత విద్య (Higher Education) అనేది చాలామంది విద్యార్థుల (Students) కల. అందుకోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే విదేశాల్లో చదవడానికి అనుమతి అవసరం. ఈమేరకు ఆయా దేశాలు వీసా (Visa) జారీ చేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు వీసా జారీలో చాలా ఆలస్యం జరుగుతుంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు, కెరీర్ (Career) బ్యాలెన్స్ దెబ్బతింటుంది. తాజాగా ఇలాంటి పరిస్థితి కెనడా(Canada)లో ఉన్నత విద్యను చదవాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల (Indian Students)కు ఎదురైంది. వీసా జారీలో ఆలస్యం కావడంతో కెనడియన్ యూనివర్సిటీలు, కాలేజీల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఇండియన్ స్టూడెంట్స్ కోసం వీసా అప్లికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కెనడాలోని ఒట్టావాలో ఉన్న భారత హైకమిషన్ అక్కడి అధికారులను కోరినట్లు కేంద్రం ప్రకటించింది.


‘వీసా సమస్యను హైలైట్ చేస్తూనే భారతీయ విద్యార్థులు ఇప్పటికే కెనడియన్ ఇన్‌స్టిట్యూట్‌లకు ట్యూషన్ ఫీజులను కట్టారనే వాస్తవాన్ని కూడా తెలియజేశాం. దీంతో భారత్‌కు చెందిన విద్యార్థుల కోసం వీసా దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేయాలని కెనడియన్ అధికారులను అభ్యర్థించాం.’ అని అడ్వైజరీలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.* అడ్వైజరీలోని ప్రధానాంశాలు..


- కెనడియన్ యూనివర్సిటీలు, భారతదేశానికి చెందిన విద్యార్థులతో పాటు ఇన్‌కమింగ్ అంతర్జాతీయ విద్యార్థులతో కమ్యూనికేట్ చేస్తున్నారు. స్టడీ పర్మిట్ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన అన్ని సమస్యలు సకాలంలో పరిష్కారమవుతాయి.


- సెప్టెంబరులో మొదటి టర్మ్ ప్రారంభమవుతుంది. అయితే అప్పటి కల్లా క్యాంపస్‌ చేరుకోవడానికి స్టడీ పర్మిట్ పొందని ఇన్‌కమింగ్ విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి యూనివర్సిటీలు ఇప్పటికే కాంటిన్జెన్సీ ప్లాన్స్‌తో రెడీగా ఉన్నాయి.


- ఇంకా వీసా అందుకోని విద్యార్థులు, టర్మ్ ప్రారంభమయ్యే సమయానికి కెనడా చేరుకోలేరు. దీంతో ఇలాంటి వారి కోసం కొన్ని సంస్థలు రిమోట్ ఆప్షన్‌ను అందిస్తున్నాయి. విద్యార్థులు ఏ కోర్సులకు రిమోట్ ఆప్షన్ ఉందో తెలుసుకోవడానికి కెనడా సంస్థలను సంప్రదించవచ్చు. ఒకవేళ లేని పక్షంలో ఏం చేయాలో వారితో చర్చించవచ్చు.


- అడ్మిషన్‌ను వాయిదా వేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం, యూనివర్సిటీలు ఆప్షన్స్‌ను కమ్యూనికేట్ చేస్తున్నాయి. అడ్మిషన్ ఆఫర్‌ను తదుపరి కాలానికి వాయిదా వేయడం లేదా సందర్భానుసారంగా అసాధారణమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం వంటివి ఇందులో ఉంటాయి.


ఇది కూడా చదవండి : ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే, ఈ టిప్స్ మీ కోసమే..


- స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (SDS) స్కీమ్ కోసం అన్ని డాక్యుమెంట్స్ సకాలంలో సమర్పించినా, ప్రస్తుతం ప్రాసెసింగ్ సమయం మించిపోవడంతో స్టడీ పర్మిట్ దరఖాస్తుల కోసం ఉద్దేశించిన IRCC వెబ్ ఫారమ్ ద్వారా అత్యవసర ప్రాసెసింగ్ కోసం అభ్యర్థనను పంపమని బాధిత విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ చేసింది.


ప్రస్తుతం కెనడాలోని పోస్ట్-సెకండరీ ఇన్‌స్టిట్యూషన్‌లలో భారతదేశం నుంచి 2,30,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు చేరారు. వీరు కెనడియన్ ఆర్థిక వ్యవస్థకు ట్యూషన్ ఫీజు రూపంలో సుమారు $4 బిలియన్ల సహకారం అందిస్తున్నారు.


కాగా, గతవారం, కెనడియన్ హైకమిషన్ వీసా ఆలస్యంపై స్పందించింది. ప్రతి వారం వేలాది మంది భారతీయ విద్యార్థులు తమ వీసాలు పొందుతున్నారని, వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా స్టడీ పర్మిట్ దరఖాస్తుల ప్రాసెసింగ్ సమయం 12 వారాలు అని పేర్కొంది.

First published:

Tags: Canada, Career and Courses, EDUCATION, JOBS, Visa

ఉత్తమ కథలు