Home /News /jobs /

CAMEL LIBRARY PROJECT CAMEL HELPS KIDS IN RURAL BALOCHISTAN STUDY FROM HOME NS GH

Camel Library project: మారుమూల గ్రామాలకు పుస్తకాలు మోసుకెళ్తున్న ఒంటె.. కరోనా నేపథ్యంలో విద్యార్థుల కోసం వినూత్న ప్రయోగం.. ఎక్కడంటే

విద్యార్థుల కోసం పుస్తకాలు తీసుకువచ్చిన ఒంటె

విద్యార్థుల కోసం పుస్తకాలు తీసుకువచ్చిన ఒంటె

కరోనా నేపథ్యంలో దాదాపు ఏడాది నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసివేయడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆన్‌లైన్ విధానంలో బోధన సాగుతోంది.అయితే, సుదూర ప్రాంతాల్లోని విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కొనలేక, ఇంటర్నెట్ సౌకర్యం లేక చదువులకు దూరమవుతున్నారు.

ఇంకా చదవండి ...
కరోనా వైరస్ అన్ని రంగాలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా విద్యాబోధనపై దీని ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఏడాది నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసివేయడంతో విద్యాబోధన ఆన్‌లైన్ విధానానికి మారింది. అయితే నగరాల్లో ఉండి, ఆర్థిక స్థోమత బాగానే ఉన్న కుటుంబాలకు ఇది పెద్ద సమస్యగా మారలేదు. కానీ గ్రామాల్లోని నిరుపేద విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు కొనలేక, ఇంటర్నెట్ సౌకర్యం లేక చదువులకు దూరమవుతున్నారు. ఇలాంటి వారి కోసం పాకిస్థాన్ ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. దాని పేరే ‘క్యామెల్ లైబ్రరీ ప్రాజెక్ట్’. ఈ ప్రాజెక్టులో భాగంగా మారుమూల ప్రదేశాలలో నివసిస్తున్న పిల్లలు చదువుకోవడానికి ఒంటెల ద్వారా పుస్తకాలను తరలిస్తున్నారు. ఇందుకు ‘రోషన్’ అనే ఒంటెను అధికారులు ఉపయోగిస్తున్నారు. నైరుతి పాకిస్థాన్, బలూచిస్తాన్ ప్రదేశాలకు రోషన్ ఒంటెను పంపిస్తున్నారు. పిల్లలకు కావాల్సిన పుస్తకాలను దీని ద్వారా తీసుకెళ్తూ ఒక లైబ్రరీగా ఉపయోగిస్తున్నారు.
NHAI Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NHAIలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Telangana Exams: ఆ యూనివర్సిటీల విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పరీక్షలు రాసే ఛాన్స్.. వివరాలివే

కరోనావైరస్ లాక్‌డౌన్ల కారణంగా ఆన్‌లైన్ విద్యకు దూరంగా ఉంటున్న పిల్లల కోసం రోషన్ పుస్తకాలను తీసుకెళ్తుంది. ప్రస్తుతం ఈ ఒంటె కెచ్ జిల్లాలో ఉంది. అక్కడ ఉన్న ప్రతి గ్రామానికి.. వారానికి మూడుసార్లు వెళ్తుంది. ఆయా ప్రాంతాల్లో రెండు గంటలు గడుపుతుంది. ఒంటె మోసుకొచ్చిన పుస్తకాలను పిల్లలు ఇంటికి తీసుకెళ్లి చదువుకొని.. మళ్లీ అది తమ ప్రాంతానికి వచ్చినప్పుడు తిరిగి ఇవ్వవచ్చు.

మరిన్ని మారుమూల గ్రామాలకు విస్తరణ..
ఈ అద్భుతమైన ప్రాజెక్టును ఒక ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న రహీమా జలాల్ రూపొందించారు. ఫెడరల్ మంత్రితో కలిసి ఆమె ఈ 'క్యామెల్ లైబ్రరీ ప్రాజెక్ట్'ను స్థాపించారు. కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయడంతో మారుమూల గ్రామీణ విద్యార్థులు నష్టపోతున్నారని గ్రహించి ఈ పైలెట్ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారు. కరోనాతో పిల్లల చదువు ఆగిపోకూడదని, ఇంటర్నెట్ సౌకర్యం లేకపోయినా చదువు కొనసాగించేలా చేయాలని ఆమె సంకల్పించింది. అనుకున్నదే తడవుగా ప్రభుత్వ సహకారంతో 2020 ఆగస్టులో ఈ లైబ్రరీని ప్రారంభించింది. 36 ఏళ్లుగా పాకిస్థాన్‌లో పిల్లల లైబ్రరీ ప్రాజెక్టులను నిర్వహిస్తున్న రెండు స్వచ్ఛంద సంస్థలైన ఫిమేల్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, అలీఫ్ లైలా బుక్ బస్ సొసైటీ సహకారంతో ఈ ప్రాజెక్టును దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. జలాల్ ఈ ప్రాజెక్టును మరిన్ని గ్రామాలకు విస్తరించాలని యోచిస్తున్నారు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: EDUCATION, Library, Online classes, Pakistan

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు