news18-telugu
Updated: June 2, 2020, 12:21 PM IST
Jobs: కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్‌లో 2167 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)
నిరుద్యోగులకు శుభవార్త. కేంద్రీయ కృషి వికాస్ సంస్థాన్ భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది. 2167 పోస్టుల్ని భర్తీ చేసేందుకు సెంట్రల్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్-CAGDI నోటిఫికేషన్ విడుదల చేస్తోంది. బిజినెస్ రిప్రజెంటేటీవ్, అసిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూన్ 25 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.cagdi.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
CAGDI Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 2167
బిజినెస్ రిప్రజెంటేటీవ్- 1036
అసిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్- 996
చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్- 36
ఇన్వెస్ట్మెంట్ మేనేజర్- 99
CAGDI Recruitment 2020: వేతనాల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు- 2167
బిజినెస్ రిప్రజెంటేటీవ్- రూ.16,680
అసిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్- రూ.20,500
చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్- రూ.45,000
ఇన్వెస్ట్మెంట్ మేనేజర్- రూ.38,000
CAGDI Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూన్ 25
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు 10వ తరగతి, బీకామ్, బీబీఏ, ఎంకామ్ లాంటి అర్హతలున్నాయి.
వయస్సు- 2020 మే 24 నాటికి 28 నుంచి 35 ఏళ్లు
ఎంపిక విధానం- ఇంటర్వ్యూ
నోటిఫికేషన్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి
ఇక్కడ క్లిక్ చేయండి.
Job News: మరిన్ని జాబ్స్ &ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంక్‌లో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే
Bank Jobs: త్వరలో ఐబీపీఎస్ నోటిఫికేషన్... భర్తీ చేసే పోస్టులు ఇవే
DRDO Jobs: డీఆర్డీఓలో 311 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
Published by:
Santhosh Kumar S
First published:
June 2, 2020, 12:21 PM IST