• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • CAG RECRUITMENT 2021 CAG RELEASED NOTIFICATION FOR 10811 AUDITOR AND ACCOUNTANT POSTS NS

CAG Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..10,811 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

CAG Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..10,811 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(CAG) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 10,811 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

  • Share this:
    దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(CAG) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం 10,811 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో ఆడిటర్ పోస్టులు 6409 కాగా, అకౌంటెంట్ పోస్టులు 4402 ఉన్నాయి. కరోనా అనంతరం ఇటీవలి కాలంలో ఇంత భారీ సంఖ్యలో ఓ ప్రభుత్వ సంస్థ నుంచి ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల కావడం ఇదే తొలిసారి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు కాగ్ అధికారిక వెబ్ సైట్లో ఫిబ్రవరి 19లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ విద్యార్హత పొంది ఉండాలి. భాషా నైపుణ్యం ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 27 ఏళ్ల వయస్సు ఉండాలి.
    హైదరాబాద్ లో భారీ జాబ్ మేళా.. పాల్గొననున్న 30 ప్రముఖ కంపెనీలు.. పూర్తి వివరాలివే
    నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తుకు మరో మూడు రోజులే గడువు

    ఖాళీల వివరాలు:
    -మొత్తం ఖాళీలు 10,811కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 144 ఆడిటర్ పోస్టులు, అకౌంటెంట్ విభాగంలో 120 ఖాళీలు ఉన్నాయి. అంటే మొత్తం ఖాళీలు 264 ఉన్నాయి.
    -తెలంగాణ రాష్ట్రంలో ఆడిటర్ విభాగంలో 220 పోస్టులు, అకౌంటెంట్ విభాగంలో 132 పోస్టులు, మొత్తం 352 పోస్టులు ఉన్నాయి.
    Notification Direct Link

    ఎంపికైన అభ్యర్థులకు రూ. 29, 200 నుంచి రూ.92, 300 వరకు వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు ప్రొహిబిషన్ పిరియడ్ ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్, ఇతర వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://cag.gov.in/en ను సందర్శించాలి. పైన ఇచ్చిన లింక్ ద్వారా అభ్యర్థులు నోటిఫికేషన్ ను సందర్శించి, పూర్తిగా చదివిన తర్వాత అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published: