Govt Jobs 2022 | భారత ప్రభుత్వానికి చెందిన కేబినెట్ సెక్రెటేరియట్ (Cabinet Secretariat) పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. 34 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. జాబ్ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి అలర్ట్. కేబినెట్ సెక్రెటేరియట్ ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ (Deputy Field Officer) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 38 ఖాళీలు ఉన్నాయి. భారత ప్రభుత్వానికి చెందిన కేబినెట్ సెక్రెటేరియట్‌లో వీరికి పోస్టింగ్ లభిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 మార్చి 4 చివరి తేదీ. ఈ పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేయాలి. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. అయితే అభ్యర్థులకు నోటిఫికేషన్లో వెల్లడించిన భాషలు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. సంబంధిత భాషలో ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికెట్ ఉండాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
Cabinet Secretariat Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...
Cabinet Secretariat Recruitment 2022: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 మార్చి 4
విద్యార్హతలు- అభ్యర్థులు సంబంధిత భాషలో డిగ్రీ లేదా రెండేళ్ల డిప్లొమా పాస్ కావాలి. లేదా సంబంధిత భాషలో నైపుణ్యం ఉండాలి.
వయస్సు- 21 నుంచి 30 ఏళ్ల లోపు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం- రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. పేపర్ 1, పేపర్ 2 రాయాల్సి ఉంటుంది. పరీక్ష నాలుగు గంటలు ఉంటుంది. 200 మార్కులు ఉంటాయి. పరీక్ష క్వాలిఫై అయినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
వేతనం- లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. రూ.44,900 వేతనం లభిస్తుంది.
Cabinet Secretariat Recruitment 2022: దరఖాస్తు విధానం
Step 1- అభ్యర్థి ఈ లింక్ క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయొచ్చు. Step 2- అప్లికేషన్ ఫామ్ పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ జత చేయాలి. Step 3- దరఖాస్తు ఫామ్‌ను చివరి తేదీ లోగా చేరేలా నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాలి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Post Bag No. 001,
Lodhi Road Head Post Office,
New Delhi-110003.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.