CABINET SECRETARIAT RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 38 DEPUTY FIELD OFFICER POSTS NS
Cabinet Secretariat Recruitment 2022: డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నెలకు రూ.44,500 వేతనం.. ఇలా అప్లై చేసుకోండి
ప్రతీకాత్మక చిత్రం
కేంద్ర ప్రభుత్వానికి చెందిన కేబినెట్ సెక్రటేరియట్ (Cabinet Secretariat) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఉన్నాయి.
భారత ప్రభుత్వ కేబినెట్ సెక్రటేరియట్ (Cabinet Secretariat Jobs) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. డిప్యూటీ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 38 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని, కావాల్సిన వివరాలను నమోదు చేసి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చ్ 4ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.44,900 వేతనం చెల్లించనున్నారు.
ఎలా అప్లై చేయాలి:
అభ్యర్థులు మొదటగా అప్లికేషన్ ఫామ్ ను ఈ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలి.
అనంతరం ఆ అప్లికేషన్ ఫామ్ ను A4 పేపర్ పై ప్రిట్ తీసుకోవాలి.
అనంతరం అప్లికేషన్ ఫామ్ ను పూర్తిగా నింపాలి.
పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అంటించాలి.
అప్లికేషన్ ఫామ్ ను Post Bag No. 001, Lodhi Road Head Post Office, New Delhi-110003 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.