Home /News /jobs /

BYJUS YOUNG GENIUS SEASON 2 NEW EPISODE SHOWCASES TWO YOUNG ACHIEVERS FROM TWO CORNERS OF INDIA SRD

BYJU’S Young Genius Season 2 : వయస్సు చిన్నది.. ప్రతిభ పెద్దది.. వీళ్ల టాలెంట్ కి ఔరా అనాల్సిందే.. (Advertisement)

BYJU’S Young Genius Season 2

BYJU’S Young Genius Season 2

BYJU’S Young Genius Season 2 : దృఢ సంకల్పం కూడిన జార్ఖండ్‌కు చెందిన మల్లయోధురాలి నుండి పూణేకు చెందిన అబ్‌స్ట్రాక్ట్ కళాకారుడి వరకు, #BYJUSYoungGenius ఈ ఎపిసోడ్ మీకు అన్ని రకాలుగా స్ఫూర్తినిస్తుంది. మొత్తం ఎపిసోడ్‌ను ఇక్కడ చూడండి

  ఈనాటి ప్రపంచంలో మీదైన ముద్ర వేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి మీకు వరంగా లభించిన మీ ప్రతిభను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేయడం. రెండవ మార్గం పట్టుదల, కృషితో మీ జీవితాన్ని మార్చుకోవడం.

  #BYJUSYoungGenius2 ప్రస్తుత ఎపిసోడ్‌లో ఈ రెండు మార్గాలలో విజయం సాధించిన వారిని ప్రేక్షకుల ముందు తీసుకువచ్చాం. ఒకరు ఎదురైన కష్టాలన్నింటిని అధిగమించి జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఒక యువ మల్లయోధుడు కాగా ఇంకొకరు కేవలం రెండు ఏళ్ళ వయస్సులోనే నాలుగు ఆర్ట్ ఎగ్జిబిషన్‌లు పెట్టి తన అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్‌లను ఎన్నింటినో అమ్మిన యువ కళాకారుడు!
  వారి అద్భుత ప్రయాణాల గురించి చదివి, ప్రేరణ పొందండి.

  బరువులతో పాటు, అంచనాలను కూడా జయించిన చంచలకుమారి–

  తన చుట్టూ ఉన్న కొరతలను ఒక అడ్డంకిలా భావించకుండా, వారి జీవనాన్ని మాత్రమే కాకుండా వారి పూర్తి సమాజాన్ని కూడా మెరుగుపరచడంపై కృషి చేసిన యువ ప్రతిభావంతుల గురించి చెప్పాలి. పేదరికం అధిగమించిన తర్వాత జాతీయ స్థాయిలో పేరుగాంచిన యువ అద్భుతాలకు 15-సంవత్సరాల చంచలకుమారి ప్రధాన ఉదాహరణ.

  చంచల స్వస్థలం జార్ఖండ్‌లోని హత్వాల్ అనే కుగ్రామం. స్పోర్ట్స్ అకాడమీలో ఉచితంగా వసతి, భోజనం, చదువు అలాగే ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి ఆమె తల్లిదండ్రులు తనని క్రీడలలోకి వెళ్ళమని ప్రోత్సహించారు.

  ఇష్టపూర్వకంగానే చంచల రెజ్లింగ్‌ను ఎంచుకుంది, ఆపై తనకు సహజంగానే అధిక స్థాయులలో పోటీపడే సహజ శక్తి మరియు నిపుణత ఉన్నాయి అని గుర్తించింది. చంచల ఇప్పటికే రెజ్లింగ్‌లో నేషనల్ గోల్డ్ మెడల్‌తో సహా అనేక బంగారు పతకాలు గెలుచుకుని, అండర్-17, 40kg వర్గాలలో గత సంవత్సరం బుడాపెస్ట్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరఫున పాల్గొంది.

  తనతో మాట్లాడినప్పుడు, చంచల తనకు ఫోగట్ సోదరీలు చాలా స్ఫూర్తినిచ్చారు అని చెప్పింది. వీరి జీవితం ఆధారంగానే దంగల్ సినిమా తీసారు. తనని ఆశ్చర్యపరుస్తూ, ఈ ఎపిసోడ్‌లో ప్రత్యేక అతిధిగా గీతా ఫోగట్ వచ్చారు, వారిద్దరూ కలిసి హోస్ట్ ఆనంద్ నరసింహన్ అడిగన కొన్ని రెజ్లింగ్ పదాలను చేసి చూపించారు కూడా. ప్రత్యేకమైన సంఘటన ఏమిటంటే చంచల చాలా సునాయాసంగా ఫోగట్‌ను పైకి ఎత్తడం.

  చంచల ప్రస్తుతం అండర్ 15 కేటగిరీలో జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం అవుతోంది. తన లక్ష్యం 2024లో జరగబోయే ఒలింపిక్స్‌లో మెడల్ సాధించడం. తన శాంతమైన అలాగే దృఢమైన పట్టుదలతో, తను ఎప్పటికైనా అది సాధిస్తుంది అనడంలో మాకు సందేహం లేదు.

  అద్వైత్‌తో కలిసి రంగులద్దడం –

  ఒక ఏడు సంవత్సరాల పిల్లాడు అబ్‌స్ట్రాక్ట్ ఆర్ట్ గురించి, “నాకు గెలాక్సీలా కనిపించింది మీకు సముద్రంలా కనిపించవచ్చు.” వంటి మాటలు మాట్లాడటం మనం ఊహించం, కానీ సరిగ్గా ఈ లక్షణమే అద్వైత్ కోలార్కర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది.

  అద్వైత్, కేవలం సంవత్సరం వయస్సులోనే పెయింటింగ్‌లు వేయడం మొదలుపెట్టాడు, తన మొదటి ప్రదర్శన ఇచ్చేటప్పటికీ అతని వయస్సు కేవలం రెండు సంవత్సరాలు. తన తల్లిదండ్రలు ప్రోత్సాహంతో, అద్వైత్ అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్‌లు వేయడం ప్రారంభించి ఇప్పటికే వాటిని US, కెనడా, లండన్ మరియు టర్కీలలో అమ్మాడు.

  2018లో కెనడాలో జరిగిన కలర్ బ్లిజార్డ్ అనే తన ప్రదర్శనలో కేవలం నాలుగు రోజులలోనే అతని 32 పెయింటింగ్‌లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత అదే సంవత్సరం Artexpoలో ప్రదర్శించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.

  అబ్‌స్ట్రాక్ట్ పెయింటింగ్‌ను ఒకటి కంటే ఎక్కువ మార్గాలలో అర్థం చేసుకోవచ్చు కాబట్టి అద్వైత్‌కు అవి అంటే చాలా ఇష్టం. అయినప్పటికీ తను ఇప్పుడు తన పెయింటింగ్‌లకు డైనోసార్‌లు, అంతరీక్షం, సముద్రం కింది ప్రపంచం వంటి వాటి నుండి స్ఫూర్తి పొందుతూ థీమ్‌లను బట్టి వేస్తున్నాడు. నలుపు చాలా దృఢంగా, బోల్డ్‌గా కనిపిస్తుంది కాబట్టి ఆ రంగంటే ఇష్టమని కూడా చెప్పారు.

  ఎపిసోడ్‌లో, పద్మశ్రీ గ్రహీత పరేష్‌మైతీకి కొన్ని పెయింటింగ్‌లు చూపించి ఆశ్చర్యపరిచాడు. అవి చూసిన ఆయన అద్వైత్ ప్రతిభను, అంత చిన్న వయస్సులోనే ఆ కళపై తనకు ఉన్న అవగాహనను మెచ్చుకుని ప్రోత్సహించారు.

  అద్వైత్ పెయింటింగ్ కొనసాగిస్తూనే, అందరి పిల్లలానే పెలియంటాలజిస్ట్ అయ్యి డైనోసార్‌లలో కొత్త జాతులను గుర్తించడం, రచయిత కావడం వంటి లక్ష్యాలను కలిగి ఉన్నాడు. తను అతి చిన్న వయస్సులోనే ప్రారంభించాడు కాబట్టి ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటాడనే నమ్మకం ఉంది!

  ఈనాటి యువ తరంలోని ఇలాంటి ప్రతిభనే BYJU’s Young Genius Season 2 చాలా అందంగా మీ ముందుకు తీసుకువచ్చింది. పట్టుదల నిండిన చంచల, ప్రతిభను వరంగా పొందిన అద్వైత్‌ను చూడటం, వారి మాటలు వినడం వల్ల మీకు చాలా స్ఫూర్తినిస్తుంది. మొత్తం ఎపిసోడ్‌ను ఇప్పుడే చూడండి!

  (This is a Partnered Content)
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: BYJUS, News18

  తదుపరి వార్తలు