News18 ప్రారంభించిన BYJU’S Young Genius, మొదటి సీజన్ ప్రకటించినప్పుడు, ప్రజలలో ఉత్సాహం స్పష్టంగా తెలిసింది. బహుశ చిన్నారులు తమ ప్రతిభను, నైపుణ్యాలను ఒక ప్లాట్‌ఫామ్‌పై ప్రదర్శించి, ప్రేక్షకులను ఆశ్చర్యపరచి, కోట్లాది చిన్నారులకు స్ఫూర్తినిచ్చిన మొదటి సందర్భం ఇదే అనుకుంటా. పాటలు పాడటం లేదా డ్యాన్స్ చేయడం వంటి కొన్ని వర్గాలకే పరిమితం కాకుండా, అద్భుతమైన మేధస్సు, చదువులో ప్రతిభ, క్రీడలలో నైపుణ్యం ఇంకా మరెన్నో ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న చిన్నారులు BYJU’S Young Geniusలో షోటాపర్లుగా నిలిచారు.
మొదటి సీజన్ ఘన విజయం మరొక సీజన్‌కు కావలసిన ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు, ఊహలు నిజమయ్యాయి, BYJU’S Young Genius రాబోతున్న సీజన్‌కు రిజిస్ట్రేషన్లు తల్లిదండ్రుల అలాగే చిన్నారుల నుండి అనూహ్య స్పందనతో దూసుకుపోతున్నాయి అన్నది వాస్తవం. BYJU’S Young Genius Season 2లో మీ కథను మాకు చెప్పడానికి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి.
అసమాన నైపుణ్యాలను ప్రదర్శించడానికి, వారిని వారిగా అంగీకరిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అన్నింటి కంటే గొప్ప రివార్డ్ ఆత్మ విశ్వాసం అలాగే వారికి నైపుణ్యాలను గర్వంగా ప్రపంచానికి చూపించడం. వారి విజయగాథలను అందిరితో పంచుకోవడం వలన వారు మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. మేధస్సును దాచి పెడితే ఎవరికి ప్రయోజనం?
రెండవ కారణం, చిన్నారులకు వారి నైపుణ్యాలపై సరైన విశ్లేషణ అందించడంతో పాటు తమ స్వంత గాథలతో వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపే ప్రముఖులు అలాగే నిర్ణేతలను చిన్నారులు కలుసుకునే అవకాశం లభిస్తుంది. అంతటి ప్రముఖులు వారి ప్రతిభను చాటి చెప్పడానికి ఎంత శ్రమించారో, ఎంత కష్టాన్ని భరించారు వినడం చిన్నారులకు వారి ప్రతిభను బయటకు తీయడానికి మానసికంగా కావలసిన భరోసా ఇస్తుంది.
చివరగా, సీజన్ 1లో పాల్గొన్న వారి జీవితాలలో ఆ తర్వాత అనూహ్య మార్పులు వచ్చాయి. తమ చుట్టూ అనేక భారతదేశంలోని అనేక జాతీయ అలాగే ప్రాంతీయ ఛానెల్‌లు ఉండగా వారి ప్రతిభ ప్రతీ ఇంటికి చేరుతుంది. అద్భుతమైన డ్రమ్ వాయిద్యకారుడిగా పేరు పొందిన అన్షుమాన్ నంది నుండి, అతి చిన్న వయస్సులోనే శాస్త్రీయ గాయకుడు అయిన స్వాస్తిక్ భరద్వాజ్, 11 ఏళ్ళ వయస్సులో పర్యావరణ పరిరక్షకురాలిగా మారిన రిథిమా పాండే నుండి షోలో ప్రదర్శించిన అందరు, అనేక మంది చిన్నారులు అలాగే తల్లిదండ్రులకు స్ఫూర్తిగా నిలిచారు.
కొత్త సీజన్ లాంచ్ అవ్వడంతో, ఇలాంటి మరింత మంది ప్రతిభవంతుల పేర్లు ఈ జాబితాలో చేరతాయి అనడంలో సందేహం లేదు. కానీ మీ చిన్నారిని of BYJU’S Young Genius సీజన్ 2లో రిజిస్టర్ చేయడానికి ఆలస్యం చేయవద్దు. రిజిస్ట్రేషన్లు త్వరలో ముగియనున్నాయి, మీ చిన్నారి ప్రతిభను ఎవరి తెలియకుండా దాచేయాలి అని మీకు ఉండదు అని మాకు తెలుసు. రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా ఇక్కడ ఫారమ్ నింపండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.