Teacher Jobs | ఇండియన్ మల్టీనేషనల్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ బైజూస్ (Byjus) తాజాగా తీపికబురు అందించింది. నిరుద్యోగులకు అదిరే శుభవార్త తీసుకువచ్చింది. భారీగా నియామకాలు (Jobs) చేపట్టనుంది. అంతేకాకుండా కంపెనీ భారీ లక్ష్యంతో ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. లాభాల బాట పట్టాలని మాస్టర్ ప్లాన్ వేసింది. 2023 మార్చి కల్లా లాభాల్లోకి రావడానికి భారీగా నియామకాలు చేపట్టబోతోంది. టైగర్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్‌ను కలిగిన ఈ ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ 2021 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 4588 కోట్ల నష్టాలను నమోదు చేసింది. ప్రమోషన్లు, లేబర్ కాస్ట్ పెరిగిపోవడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు.
బైజూస్ తన మార్కెటింగ్, నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి, 2023 మార్చి నాటికి లాభాల బాట పట్టడానికి కొత్త ప్రణాళికను రచించింది. ఇందులో భాగంగానే వచ్చే ఆరు నెలల కాలంలో దాదాపు 5 శాతం సిబ్బందిని తగ్గించుకోనుంది. అంటే దాదాపు 2500 మంది వర్కర్లను ఇంటికి పంపనుంది. అదేసమయంలో నియామకాలు కూడా చేపట్టనుంది.
క్రెడిట్ కార్డు బిల్లు టైమ్‌కి కట్టకపోయినా ఏం కాదు.. ఈ రూల్ తెలుసుకోండి!
బైజూస్ సహ వ్యవస్థాపకురాలు దివ్య గోకుల్‌నాథ్ ప్రకారం.. కొత్త భాగస్వామ్యాల ద్వారా విదేశాలలో బ్రాండ్ అవగాహన అంశంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టనుంది. అంతేకాకుండా దేశీ, అంతర్జాతీయ కార్యకలాపాల కోసం 10,000 మంది ఉపాధ్యాయులను నియమించుకోనుంది.
ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి బొనాంజా..
‘మేము మార్చి 2023 నాటికి లాభదాయకత కోసం ఒక మార్గాన్ని రూపొందించాం. భారతదేశం అంతటా గణనీయమైన బ్రాండ్ అవగాహనను ఏర్పరచుకున్నాం. అయితే ఇప్పుడు మార్కెటింగ్ బడ్జెట్‌ను సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. అంతర్జాతీయంగా సేవలు విస్తరించడానికి ఏ ఏ ఖర్చులు అవసరమో గుర్తించాల్సి ఉంది. అలాగే నిర్వహణ వ్యయాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే వివిధ బిజినెస్ యూనిట్లను విలీనం చేసే అంశంపై కూడా పని చేస్తున్నాం’ అని గోకుల్‌నాథ్ వివరించారు.
కాగా 2019- 20లో రూ. 231 కోట్లుగా ఉన్న కంపెనీ నష్టాలు 2020- 21 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 4588 కోట్లకు పెరిగాయి. అంటే నష్టాలు భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు. అందుకే కంపెనీ ఇప్పుడు నష్టాలను తగ్గించుకునే పనిలో పడింది. లాభాల బాట పట్టేందుకు వ్యూహాలను రచించింది. ఇకపోతే బైజూస్ కొనుగోళ్ల ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా స్టార్టప్స్‌ను కొనుగోలు చేసింది. తద్వారా తన కార్యకలాపాలను మరింత విస్తరించుకుంటూ వస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ నష్టాలు కూడా బాగా పెరిగిపోయాయి. అందుకే ఇప్పుడు ఈ నష్టాల భర్తీ అంశంపై కంపెనీ ప్రధానంగా ఫోకస్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.