హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BYJUS: గూగుల్​తో జతకట్టిన బైజుస్... మెరుగైన ఇ-లెర్నింగ్​ సర్వీసులే లక్ష్యం

BYJUS: గూగుల్​తో జతకట్టిన బైజుస్... మెరుగైన ఇ-లెర్నింగ్​ సర్వీసులే లక్ష్యం

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Byjus | ఇండియాలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు సహకారం అందించేందుకు బైజూస్, గూగుల్ చేతులు కలిపాయి.

కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో ఆన్‌లైన్ విద్యకు ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో భారతీయ విద్యార్థులకు ఉచితంగా లెర్నింగ్​ సొల్యూషన్స్​ అందించేందుకు ప్రముఖ ఎడ్​ టెక్​ సంస్థ బైజూస్​ ముందడుగేసింది. దేశీయంగా పాఠశాలల్లో ఆన్​లైన్​ విద్యాభ్యాసానికి తోడ్పడేలా అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్​తో బైజూస్​ చేతులు కలిపింది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆన్​లైన్​ విద్యలో తోడ్పడేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఒప్పందం కింద ‘గూగుల్​ వర్క్​స్పేస్​ ఫర్​ ఎడ్యుకేషన్’​తో బైజూస్​ స్టూడెంట్​ పోర్టల్​ను అనుసంధానిస్తారు. ఈ ప్రోగ్రామ్​లో నమోదు చేసుకున్న విద్యాసంస్థలకు ఉచితంగానే ఆన్​లైన్​ కోర్సులు అందిస్తారు. తద్వారా మ్యాథ్స్​, సైన్స్​ బోధనకు నేరుగా యాక్సెస్​ లభిస్తుంది.

అధ్యాయాల వారీగా స్లైడ్స్​, రెడీమేడ్​ అసైన్​మెంట్స్​, డేటా బ్యాంక్​లు, సమ్మరీ డాక్యుమెంట్లు, హ్యాండవుట్స్​, టెస్ట్స్​ ఇలా మరెన్నో టాస్క్​లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. గూగుల్​తో ఒప్పందంపై బైజూస్​ చీఫ్​ ఆపరేటింగ్​ ఆఫీసర్​ మృణాల్​ మోహిత్​ మాట్లాడుతూ.. "గతేడాది నుంచి ఆన్​లైన్​ విద్యాభ్యాసం గణనీయ పెరుగుదలను చూస్తోంది. కరోనా కారణంగా అంతా ఆన్​లైన్​ లెర్నింగ్​ బాట పట్టాల్సిన అవసరం ఏర్పడింది. అందువల్ల, విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెరుగైన ఈ–లెర్నింగ్​ సేవలందించేందుకు గూగుల్​తో ఒప్పందం కుదుర్చుకున్నాం. అంతర్జాతీయ టెక్​ దిగ్గజంతో కలిసి పనిచేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఆన్​లైన్​ లెర్నింగ్​తో విద్యార్థులకు మరింత చేరువ కావడం, డిజిటల్​ విప్లవానికి తొడ్పాటు అందించడమే మా ముందున్న ప్రధాన లక్ష్యాలు’ అని చెప్పారు.

Realme Anniversary Sale: రియల్‌మీ సేల్‌లో ఈ 28 స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్స్

Realme X7 Max 5G: కాసేపట్లో రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ సేల్... ఆఫర్ వివరాలు ఇవే

డిజిటల్​ విప్లవానికి తోడ్పాటు


సౌకర్యవంతమైన ఆన్​లైన్​ లెర్నింగ్​కు తోడ్పాటు అందించేలా బైజూస్​ గుగుల్​తో ఒప్పందం చేసుకుంది. ‘గూగుల్ వర్క్​స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్’ ప్రోగ్రామ్​ ముఖ్యంగా ఉపాధ్యాలయులకు సరళత్వాన్ని, భద్రతను అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్​లో భాగంగా ఉపాధ్యాయులు గూగుల్​ మీట్​ యాక్సెస్​ పొందగలుగుతారు. ఒకేసారి 100 మంది విద్యార్థులు ఉచితంగా ఈ క్లాసులను యాక్సెస్​ చేసుకునే అవకాశం లభిస్తుంది.

దీనిపై గూగుల్​ ఎడ్యుకేషన్​ దక్షిణాసియా హెచ్​ బాని ధావన్​ మాట్లాడుతూ.. ‘దేశవ్యాప్తంగా విద్యార్థులను చేరుకునేందుకు బైజూస్​తో భాగస్వామ్యం కావడం మాకెంతో ఆనందంగా ఉంది. ప్రస్తుతం ఇంగ్లీష్​ భాషలోనే అందుబాటులో ఉన్న మా ఇంటరాక్టివ్​ సెషన్స్​ను ఇతర అన్ని భారతీయ భాషల్లో కూడా అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మెరుగైన ఈ–లెర్నింగ్​ సౌకర్యాన్ని అందించడమే మా లక్ష్యం.” అని అన్నారు. కాగా, బైజూస్​ ప్లాట్​ఫామ్​లో ప్రపంచవ్యాప్తంగా 95 మిలియన్ల మంది విద్యార్థులు నమోదయ్యారు. దీంతో ప్రపంచపు అగ్రగామి ఎడ్యుకేషన్​ టెక్నాలజీ సంస్థగా బైజూస్​ కొనసాగుతోంది.

First published:

Tags: Online classes, Online Education

ఉత్తమ కథలు