బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (Bureau Of Indian Standards) గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 100 పోస్టులను రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కొలువు కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇదొక శుభవార్త(Good News) అని చెప్పవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 27గా పేర్కొన్నారు. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ పోస్టులను రెండేళ్ల కాలానికి తాత్కాలిక కాంట్రాక్ట్ ప్రాతిపదికన(Contract Basis) రిక్రూట్ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, వేతనాలు, ఎంపిక విధానం మొదలైన ఈ నియామకానికి సంబంధించిన ఇతర ముఖ్యమైన సమాచారం కింద ఇవ్వడమైంది.
విద్యా అర్హత: నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డులు లేదా విశ్వవిద్యాలయాల నుండి BE లేదా BTech, EEE, FCT, MCMలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థి కనీస వయస్సు 27 ఏళ్లకు తక్కువగా ఉండకూడదు. అంతే కాకుండా.. గరిష్టంగా 35 ఏళ్లు మించకూడదు.
వయస్సు సడలింపు:
రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు..
ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
జీతం .. నెలకు రూ.50వేలు
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష, స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 06 ఆగస్టు 2022
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 27 ఆగస్టు 2022
నోటిఫికేషన్ ముఖ్యమైన లింకులు
అధికారిక నోటిఫికేషన్ PDF: ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక వెబ్‌సైట్: bis.gov.in
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
Step 1 : ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. దాని కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.
Step 2 : తర్వాత అక్కడ కనిపించే రిక్య్రూట్ మెంట్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Step 3 : ఈ వెబ్ పేజీలో రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి నోటిఫికేషన్ .. రెండోది అప్లై ఆన్ లైన్. వివరాలను తెలుసుకోవడానికి నోటిఫికేషన్ డౌన్ లోడ్ చేసుకొని చదువుకోవచ్చు.
Step 4 : చివరగా.. Click here to Apply Online పై క్లిక్ చేసి దరఖాస్తును సమర్పించవచ్చు. దానిని ప్రింట్ తీసుకొని భవిష్యత్ అవసరాల కొరకు భద్ర పరచుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central Government Jobs, Centre government, JOBS