యూకే-బేస్డ్ యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్ (University of Essex).. ఇతర దేశాల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎసెక్స్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్(EPP)ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఇది యూనివర్సిటీలో చదవడానికి వచ్చే ఇన్‌కమింగ్ విద్యార్థుల(Incoming Students)కు సహాయపడే స్పెషల్, ఫ్రీ ఆన్‌లైన్ కోర్సు. విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా( Free of Cost) ఈ కోర్సును అందించనుంది. ప్రత్యేకంగా భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులను ఆకర్షించడానికి, యూనివర్సిటీ చదువుల కోసం వారిని సిద్ధం చేయడానికి ఈ కోర్సును రూపకల్పన చేసినట్లు ఎసెక్స్ యూనివర్సిటీ తెలిపింది. ఆరు వారాల పాటు జరిగే ఈ కోర్సు(Course)ద్వారా విద్యార్థులకు ఇండిపెండెంట్ లెర్నింగ్, క్రిటికల్ థింకింగ్, అకడమిక్ ఇంటిగ్రిటీ వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ ఎసెక్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ స్టడీ(Under Graduate Study) కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ కోర్సు అందుబాటులో ఉంటుంది. కోర్సు పూర్తి చేసి, 2022-23 అకడమిక్ ఇయర్‌కు ఎస్సెక్స్‌లో చదువుకోవడానికి నమోదు చేసుకుంటే రూ. 24,000 ఆర్థిక సహాయానికి కూడా అర్హత పొందుతారు. తమ వర్సిటీలో చదువుకోవడానికి వచ్చే ఇన్‌కమింగ్ విద్యార్థుల కోసం గతేడాది ఎసెక్స్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్(EPP)ను ఎసెక్స్ యూనివర్సిటీ ప్రారంభించింది. ఈ కోర్సు పట్ల పాఠశాలు, కాలేజీలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు యూనివర్సిటీ తెలిపింది.
ఎసెక్స్ యూనివర్సిటీ డిప్యూటీ వైస్-ఛాన్సలర్, ప్రొఫెసర్ లోర్నా ఫాక్స్ ఓ'మహోనీ మాట్లాడుతూ.. “గత సంవత్సరం ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించాం. కరోనా కారణంగా సాధారణ చదువులకు అంతరాయం ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలో చదువుకోవాలని ఉత్సాహంతో ఉన్నవారి కోసం దీన్ని రూపకల్పన చేశాం. ఈ కొత్త కోర్సులో విజయం సాధించాలనే వారి సంకల్పం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాం. విద్యార్థులు, ఉపాధ్యాయుల సానుకూల అభిప్రాయాన్ని అనుసరించి అప్‌కమింగ్ విద్యార్థుల కోసం ఈపీపీ ప్లాట్‌ఫారమ్‌ను క్రియేట్ చేశాం.’’ అని తెలిపారు.
‘కరోనా సమయంలో విద్యార్థులు ఎన్నో కష్టాలు పడ్డారు. వారు విజయవంతం కావడానికి మేం చేయగలిగినదంతా చేయాలనుకుంటున్నాం’ అని ప్రొఫెసర్ ఫాక్స్ ఓ'మహోనీ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం ప్రోగ్రామ్ కోసం 500 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారని, దీంతో ఈ ఏడాది కోర్సు మరింత ప్రభావవంతంగా ఉంటుందని ఫాక్స్ ధీమా వ్యక్తం చేశారు.
ఎసెక్స్ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల కోసం మాస్టర్ ప్రిపరేషన్ ప్రోగ్రామ్(MPP)ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా మరో రెండు ఇతర ప్రోగ్రామ్‌లను సైతం ఆఫర్ చేస్తోంది. ఇందులో ఒకటి 12-13 సంవత్సరాల విద్యార్థులకు కాగా, మరొకటి 10-11 సంవత్సరాల స్టూడెంట్స్ కోసం అందిస్తోంది. తరగతి గదిలో విద్యార్థులు స్వతంత్రంగా వ్యవహరించేలా ఈ కోర్సులను సమాచారం, సలహా, గైడెన్స్ వంటి క్వాలిటీ సోర్స్ నుంచి డిజైన్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Students, University