హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT Madras: ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్.. ఆ ఎగ్జామ్ కు ఉచిత కోచింగ్.. ఏ ఐఐటీలో అంటే !

IIT Madras: ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్.. ఆ ఎగ్జామ్ కు ఉచిత కోచింగ్.. ఏ ఐఐటీలో అంటే !

 ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కు  బంపర్ ఆఫర్.. ఆ ఎగ్జామ్ కు ఉచిత కోచింగ్.. ఏ ఐఐటీ లో అంటే !

ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కు బంపర్ ఆఫర్.. ఆ ఎగ్జామ్ కు ఉచిత కోచింగ్.. ఏ ఐఐటీ లో అంటే !

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE- గేట్‌)కు ప్రిపేర్ అవుతున్న వారికి ఐఐటీ మద్రాస్(IIT Madras) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కోసం ఉచితంగా ఆన్‌లైన్(Online) మోడ్‌లో కోచింగ్ అందించనున్నట్లు తెలిపింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (GATE- గేట్‌)కు ప్రిపేర్ అవుతున్న వారికి ఐఐటీ మద్రాస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష కోసం ఉచితంగా ఆన్‌లైన్(Online) మోడ్‌లో కోచింగ్ అందించనున్నట్లు తెలిపింది. ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్ లెర్నింగ్ (NPTEL) ద్వారా గేట్ కోసం ఉచితంగా శిక్షణ అందించడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ను లాంచ్ చేసింది. ఈమేరకు ఎన్‌పీటీఈఎల్ గేట్ పోర్టల్‌ను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. సీఎస్‌ఆర్ గ్రూప్‌‌కు చెందిన ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ(Technology) సంస్థ అమేడియస్ ల్యాబ్స్ బెంగళూరు(Bengaluru) ఇందుకు సహాయ సహకారాలు అందించింది. ఎన్‌పీటీఈఎల్ అనేది ఐఐటీలు, ఐఐఎస్‌సీ కోసం ఉచిత ఆన్‌లైన్ సర్టిఫికేషన్ కోర్సులను అందించే వేదిక. కాగా, ఐఐటీలు, ఐఐఎస్‌సీతో ‌పాటు టాప్ కాలేజీల్లో మాస్టర్స్ స్థాయి కోర్సులు లేదా పీహెచ్‌డీ‌లో అడ్మిషన్లు పొందాలంటే గేట్ స్కోర్ తప్పనిసరి.

ఈ కొత్త పోర్టల్ ద్వారా, గేట్ సిలబస్‌కు అనుగుణంగా విద్యార్థులకు వీడియో సొల్యూషన్స్, ప్రాక్టీస్ టెస్ట్స్‌తో‌పాటు ఆన్‌లైన్ అసిస్టెంట్స్ అందించడమే NPTEL లక్ష్యం. వచ్చే ఏడాది దాదాపు 9 నుంచి 10 లక్షల మంది విద్యార్థులు గేట్‌‌కు హాజరుకానున్నారు. దీంతో గేట్ అభ్యర్థులకు ప్రిపరేషన్ ప్రయాణాన్ని ఎన్‌పీటీఈఎల్ పోర్టల్‌ మరింత సులభతరం చేయనుంది.

ఐఐటీ మద్రాస్ డైరెక్టర్, ప్రొఫెసర్ వి.కామకోటి మాట్లాడుతూ.. “అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్‌లో విద్యార్థులు తెలుసుకున్న ఫండమెంటల్స్‌లోని పరిజ్ఞానాన్ని గేట్ పరీక్షిస్తుంది. గేట్‌లో విజయం సాధించడం వల్ల ఉన్నత విద్య కలను సాకారం చేసుకోవచ్చు. లేదా ఉద్యోగాలను పొందడానికి అవకాశం ఉంటుంది. గేట్ కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రిపరేషన్‌లో గైడెన్స్ ఇవ్వడానికి ఎన్‌పీటీఈఎల్ కంటెంట్‌ను లివరేజ్ చేయనుంది.’’ అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:Mahindra EVs: ఇక అన్ని సెగ్మెంట్లలోకి ఈవీ కార్స్ లాంచ్.. మహీంద్రా ఫ్యూచర్ ప్లాన్ చూస్తే మతిపోతుందీ..!


 గేట్ ప్రిపరేషన్ పోర్టల్‌లోని కీలక అంశాల గురించి వెల్లడించారు ఐఐటీ మద్రాస్, ఎన్‌పీటీఈఎల్ కోఆర్డినేటర్ డాక్టర్ రామకృష్ణ పసుమర్తి. ఆయన మాట్లాడుతూ.. “గేట్-సంబంధిత ప్రాబ్లమ్స్ పరిష్కరించడానికి లేదా గేట్ ప్రిపరేషన్‌లో కొంత సహాయం అందించమని చాలామంది అభ్యర్థిస్తుంటారు. అందుకే గేట్ పరీక్షను ఛేదించడానికి కాన్సెప్ట్‌ల నుంచి ట్రిక్స్ వరకు అన్నింటినీ కవర్ చేస్తూ సమగ్రమైన వన్-స్టాప్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం. గేట్ అభ్యర్థుల కోసం ఇటీవల లైవ్ మెంటరింగ్ సెషన్స్ తోపాటు యాక్టివ్ లెర్నింగ్‌ను ప్రారంభించాం.’’ అని తెలిపారు.

ఇంజనీరింగ్ విద్యను పెంపొందించడానికి ఐఐటీల పూర్వ విద్యార్థులు సామాజిక చొరవలో భాగంగా IITM PALS‌ను 2012లో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇది దేశంలోని ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు, అధ్యాపకులు & మేనేజ్‌మెంట్‌లకు ఎంతో సహాయ సహకారాలను అందిస్తోంది. IITM PALS‌ ఇటీవల హోస్ట్ చేసిన ఓ ప్రోగ్రామ్‌లో GATE ప్రిపరేషన్ పోర్టల్ లాంచ్ చేశారు.

First published:

Tags: Gate, IIT Madras, JOBS, Online course

ఉత్తమ కథలు