హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Career Wise: ఫంక్షనల్ న్యూట్రిషన్‌ రంగంలో కెరీర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ వివరాలు మీకోసమే

Career Wise: ఫంక్షనల్ న్యూట్రిషన్‌ రంగంలో కెరీర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఈ వివరాలు మీకోసమే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జీవన శైలికి సంబంధించిన పూర్తి విషయాలను ఫంక్షనల్ న్యూట్రిషన్ ద్వారా తెలుసుకోవచ్చు. న్యూస్18 అందిస్తున్న ‘కెరీర్ వైజ్‌’లో భాగంగా ఫంక్షనల్ న్యూట్రిషన్‌లో రంగంలో కెరీర్ ఎలా ఉంటుంది, ఎలాంటి అవకాశాలు ఉంటాయో పరిశీలిద్దాం. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

దేశంలో వైద్య రంగం గణనీయమైన పురోగతి సాధిస్తోంది. అయితే కొత్త కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌లు, దీర్ఘకాలిక జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుండడం వైద్య రంగానికి సవాలుగా మారింది. జీవన శైలిలో మార్పులే ఇలాంటి క్రానిక్ లైఫ్ స్టైల్ డిసీజెస్‌కు మూల కారణం. సరైన జీవన శైలితో వీటికి చెక్ పెట్టవచ్చు. జీవన శైలికి సంబంధించిన పూర్తి విషయాలను ఫంక్షనల్ న్యూట్రిషన్ ద్వారా తెలుసుకోవచ్చు. న్యూస్18 అందిస్తున్న ‘కెరీర్ వైజ్‌’లో భాగంగా ఫంక్షనల్ న్యూట్రిషన్‌లో రంగంలో కెరీర్ ఎలా ఉంటుంది, ఎలాంటి అవకాశాలు ఉంటాయో పరిశీలిద్దాం.

ఫంక్షనల్ న్యూట్రిషన్ అనేది ఫంక్షనల్ మెడిసిన్‌లో కీలకమైనది. ఇది వ్యాధుల చికిత్స లేదా నివారణకు మూలకారణాలను విశ్లేషిస్తుంది. పంక్షనల్ న్యూట్రిషన్ చేసిన వారిని ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ అంటారు. ఆహారం, జీవనశైలి మార్పులు, డిటాక్సిఫికేషన్, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఫంక్షనల్ ఎక్స్‌ర్‌సైజ్, ఇతర సమగ్ర పద్ధతులతో క్రానిక్ లైఫ్ స్టైల్ డిసీజెస్‌‌కు ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ చెక్ పెడతారు.

అవగాహన ఉండాల్సిన విషయాలు

ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్‌‌గా కెరీర్‌లో స్థిరపడాలనుకుంటే మానవ శరీరం, అది పనిచేసే తీరుపై పూర్తి అవగాహన ఉండాలి. ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ విధుల్లో బ్లడ్ (రక్తం) డిసైడింగ్ ప్యాక్టర్‌గా ఉంటుంది. బ్లడ్ ప్యారామీటర్స్‌తో పాటు పేషెంట్ వ్యాధి లక్షణాలు, వాటి మధ్య సంబంధం, నివారణకు ఎలాంటి చికిత్స అందించాలి అనే వాటిపై సమగ్ర అవగాహన ఉండాలి. అలాగే వ్యాధుల చికిత్సకు సంబంధించిన పూర్తి విషయ పరిజ్ఞానం ఉండాలి. ఇది వ్యాధి స్వభావం, లక్షణాలు, అంతర్లీన కారణాలపై అవగాహన కల్పిస్తుంది. అలాగే ఆహారం, ఇతర చికిత్స పద్దతులతో పాటు నిర్దిష్ట రోగికి ఏది ఉత్తమమో తెలుసుకోవాలి.

కెరీర్ వివరాలు

ఫంక్షనల్ న్యూట్రిషన్ రంగంలోకి ఎంటర్ కావాలంటే, ముందుగా డిగ్రీ చేయాలి. న్యూట్రిషన్‌లో అనేక బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ ప్రోగ్రామ్‌లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఫంక్షనల్ న్యూట్రిషన్ డిగ్రీతో వివిధ రకాల కెరీర్‌ ఆప్షన్స్ ఉంటాయి. ఫంక్షనల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్, ఫంక్షనల్ న్యూట్రిషనిస్ట్ లేదా ఇన్‌స్ట్రక్టర్‌గా కెరీర్ కొనసాగించవచ్చు. సర్టిఫికేషన్‌తో కూడా కెరీర్ ప్రారంభించవచ్చు. మాస్టర్ డిగ్రీ తప్పనిసరి కాదు.

తప్పనిసరిగా ఉండాల్సిన స్కిల్స్

జీవనశైలి మార్పులను ప్రారంభించేలా వ్యక్తులను ప్రేరేపించే సామర్థ్యం ఫంక్షనల్ న్యూట్రిషన్టులకు ఉండాలి. ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటాడు కాబట్టి, డెవలప్ చేసే సొల్యూషన్స్ వారికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. రోగి ఎందుకు అనారోగ్యంగా ఉన్నారు, దాని నుంచి ఎలా బయటపడాలో స్పష్టంగా వివరించే సామర్థ్యం ఉండాలి. ఏదైనా ఎందుకు ముఖ్యమైనదో రోగికి సవివరంగా వివరించే సామర్థ్యం ఉండాలి. కష్టమైన యాక్టివిటీస్‌ను క్రమంతప్పకుండా చేసేలా ఒప్పించే మనస్తత్వం ఉండాలి. ల్యాబ్ రిజల్ట్స్‌ను విశ్లేషించే సామర్థ్యం ఉండాలి.

First published:

Tags: Career and Courses, Career tips, JOBS

ఉత్తమ కథలు