BSNL Jobs: బీఎస్ఎన్ఎల్‌ తెలంగాణ సర్కిల్‌లో 100 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

BSNL Telangana Circle Recruitment 2020 | తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ సర్కిల్ బీఎస్ఎన్ఎల్ ఖాళీలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

news18-telugu
Updated: March 6, 2020, 10:31 AM IST
BSNL Jobs: బీఎస్ఎన్ఎల్‌ తెలంగాణ సర్కిల్‌లో 100 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే
BSNL Jobs: బీఎస్ఎన్ఎల్‌ తెలంగాణ సర్కిల్‌లో 100 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL తెలంగాణ సర్కిల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 100 ఖాళీలున్నాయి. ఇవి ఏడాది కాలం పోస్టులు మాత్రమే. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS వెబ్‌సైట్‌ http://www.mhrdnats.gov.in/ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 16 చివరి తేదీ.

BSNL Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...



మొత్తం ఖాళీలు- 100
గ్రాడ్యుయేట్ అప్రెంటీస్- 75
టెక్నీషియన్ అప్రెంటీస్- 25
విద్యార్హత- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిగ్రీ. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో డిప్లొమా ఉండాలి. 2018, 2019, 2020 లో పాసైనవారు మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 4NATS వెబ్‌సైట్‌‌లో ఎన్‌రోల్ చేయడానికి చివరి తేదీ- 2020 మార్చి 12
బీఎస్ఎన్ఎల్ అప్రెంటీస్‌కు అప్లై చేయడానికి చివరి తేదీ- 2020 మార్చి 16
సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం డేటాబేస్ అందించడానికి చివరి తేదీ - 2020 మార్చి 18
ఇంటర్వ్యూ- 2020 మార్చి 19
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ జరిగే వేదిక:
PGM TD,
BSNL Bhavan,
Adarsh Nagar,
Hyderabad – 500 063

BSNL Recruitment 2020: అప్లై చేయండి ఇలా...


స్టెప్‌ 1 లో ముందుగా http://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
Enroll పైన క్లిక్ చేయండి.
మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి.
యూనిక్ ఎన్‌రోల్‌మెంట్ నెంబర్ వస్తుంది.
ఎన్‌రోల్‌మెంట్ వెరిఫికేషన్, అప్రూవల్ కోసం ఒక రోజు సమయం పడుతుంది.

స్టెప్‌ 2 లో http://www.mhrdnats.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి లాగిన్ చేయాలి.
ఎస్టాబ్లిష్‌మెంట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేసి మీ రెజ్యూమ్ అప్‌లోడ్ చేయాలి.
BHARAT SANCHAR NIGAM LIMITED అని టైప్ చేసి అప్లై చేయాలి.

నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్‌లో గతంలోనే ఎన్‌రోల్ చేసిన విద్యార్థులు స్టెప్ 2 ఫాలో అయితే చాలు. ఎన్‌రోల్‌మెంట్‌కు సంబంధించిన ఏవైనా సందేహాలు ఉంటే studentquery@boat-srp.com, applacement@boat-srp.com, generalquerytl@boat-srp.com మెయిల్ ఐడీల్లో సంప్రదించొచ్చు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
NATS వెబ్‌సైట్‌‌లో ఎన్‌రోల్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Singareni Jobs: సింగరేణిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే

Railway Jobs: రైల్వేలో 2792 ఉద్యోగాలు... నేటి నుంచి దరఖాస్తులు

LIC Jobs 2020: ఎల్ఐసీలో 218 జాబ్స్... మార్చి 15 చివరి తేదీ

 
First published: March 6, 2020, 10:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading