BSNL RECRUITMENT 2022 ONLINE APPLICATIONS INVITING FOR LEGAL PROFESSIONAL VACANCIES SALARY RS 70000 HERE FULL DETAILS NS
BSNL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. బీఎస్ఎన్ఎల్ లో రూ.75 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
ప్రతీకాత్మక చిత్రం
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
LLB చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు విద్యార్హత పొందిన సంస్థ తప్పని సరిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) తో గుర్తింపు పొంది ఉండాలి. అభ్యర్థులు LLBలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్హత అనంతరం మూడేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75 వేల వేతనం చెల్లించనున్నారు. వేతనం మినహా ఏ ఇతర అలవెన్స్ లు ఇవ్వబడదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంకా ఎంపికైన అభ్యర్థులు బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్, న్యూ డిల్లీలో లో పని చేయాల్సి ఉంటుంది. BOB Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ.. ఇలా అప్లై చేయండి
Step 4: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మొదటగా New Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి. Step 5: పేరు, ఇతర సూచించిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. Step 6: అనంతరం మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి లాగిన్ అయి అప్లై చేసుకోవాలి.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.