Home /News /jobs /

BSNL RECRUITMENT 2022 ONLINE APPLICATIONS INVITING FOR LEGAL PROFESSIONAL VACANCIES SALARY RS 70000 HERE APPLICATION PROCESS NS

BSNL Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. బీఎస్ఎన్ఎల్ లో రూ.75 వేల వేతనంతో జాబ్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదల చేస్తున్న సంస్థ తాజాగా మరో నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. లీగల్ ప్రొఫెషనల్స్ (Fulltime Young Legal Professionals) విభాగంలో ఈ నియామకాలను  చేపట్టారు. అయితే ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మొదట కాంట్రాక్ట్ గడువు ఏడాది ఉంటుంది. అభ్యర్థుల పర్ఫార్మెన్స్, అవసరాల రిత్యా కాంట్రాక్ట్ ను 2, 3 ఏళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది.
    Railway Recruitment 2022: రైల్వేలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతతో జాబ్స్.. కేవలం ఇంటర్వూ ద్వారానే ఎంపిక.. రూ. 44 వేల వేతనం

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    LLB చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు విద్యార్హత పొందిన సంస్థ తప్పని సరిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) తో గుర్తింపు పొంది ఉండాలి. అభ్యర్థులు LLBలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్హత అనంతరం మూడేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75 వేల వేతనం చెల్లించనుననారు. వేతనం మినహా ఏ ఇతర అలవెన్స్ లు ఇవ్వబడదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంకా ఎంపికైన అభ్యర్థులు బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్, న్యూ డిల్లీలో లో పని చేయాల్సి ఉంటుంది.
    NMDC Recruitment 2021: ఎన్ఎండీసీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా నేరుగా ఇంటర్వ్యూల ద్వారానే ఎంపిక

    ఎలా అప్లై చేయాలంటే:
    Step 1: అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లై చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 2: అనంతరం మీకు నోటిఫికేషన్ కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది.
    Step 3: అనంతరం Click here for Registration అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Telangana Govt Jobs: తెలంగాణలో బ్యాక్ లాగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇలా అప్లై చేసుకోండి.. వివరాలివే



    Step 4: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మొదటగా New Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 5: పేరు, ఇతర సూచించిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
    Step 6: అనంతరం మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి లాగిన్ అయి అప్లై చేసుకోవాలి.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: BSNL, Central Government Jobs, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు