Home /News /jobs /

BSNL RECRUITMENT 2022 NOTIFICATION RELEASED FOR LEGAL PROFESSIONAL VACANCIES SALARY RS 70000 HERE FULL DETAILS NS

BSNL Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. BSNLలో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

BSNL నుంచి పలు ఉద్యోగాల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.75 వేల వేతనం చెల్లించనున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.

    భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notification) విడుదల చేస్తున్న సంస్థ తాజాగా మరో నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. లీగల్ ప్రొఫెషనల్స్ (Fulltime Young Legal Professionals) విభాగంలో ఈ నియామకాలను  చేపట్టారు. అయితే ఎంపికైన అభ్యర్థులు కాంట్రాక్ట్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. మొదట కాంట్రాక్ట్ గడువు ఏడాది ఉంటుంది. అభ్యర్థుల పర్ఫార్మెన్స్, అవసరాల రిత్యా కాంట్రాక్ట్ ను 2, 3 ఏళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
    Oil India Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 62 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

    ఖాళీలు, విద్యార్హతల వివరాలు:
    LLB చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు విద్యార్హత పొందిన సంస్థ తప్పని సరిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(BCI) తో గుర్తింపు పొంది ఉండాలి. అభ్యర్థులు LLBలో తప్పనిసరిగా 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్హత అనంతరం మూడేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.75 వేల వేతనం చెల్లించనుననారు. వేతనం మినహా ఏ ఇతర అలవెన్స్ లు ఇవ్వబడదని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఇంకా ఎంపికైన అభ్యర్థులు బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ ఆఫీస్, న్యూ డిల్లీలో లో పని చేయాల్సి ఉంటుంది.
    PGCIL Recruitment 2022: బీటెక్ చేసిన వారికి అలర్ట్.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో జాబ్స్.. ఈ లింక్ తో అప్లై చేసుకోండి

    ఎలా అప్లై చేయాలంటే:
    Step 1: అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు అప్లై చేయడానికి ఈ లింక్ పై క్లిక్ చేయాలి.
    Step 2: అనంతరం మీకు నోటిఫికేషన్ కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది.
    Step 3: అనంతరం Click here for Registration అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Govt jobs 2022: ప్ర‌భుత్వ ఉద్యోగార్థుల‌కు అల‌ర్ట్‌.. ఈ జాబ్స్ అప్లై చేశారా.. కొద్ది రోజులే చాన్స్‌!



    Step 4: కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. మొదటగా New Registration ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
    Step 5: పేరు, ఇతర సూచించిన వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
    Step 6: అనంతరం మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసి లాగిన్ అయి అప్లై చేసుకోవాలి.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: BSNL, Central Government Jobs, Job notification

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు