Home /News /jobs /

BSNL Recruitment 2021: BSNLలో అప్రంటీస్ ఖాళీలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

BSNL Recruitment 2021: BSNLలో అప్రంటీస్ ఖాళీలు.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నుంచి అప్రంటీస్ ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజు ఆఖరి తేదీగా అధికారులు నిర్ణయించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...
    ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది.  పలు అప్రంటీస్ ఖాళీల (Jobs) భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో(Notification) వెల్లడించారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ విధానంలో ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ. 8 వేల ఉపకార వేతనం(stipend) ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే అప్రంటీస్ గా పని చేస్తన్నవారు. ఏడాది అంతకన్నా ఎక్కువగా పని చేసిన అనుభవం ఉన్న వారు ఈ ఉద్యోగాలకు (Jobs) అప్లై చేసేందుకు అనర్హులని తెలిపారు.

    ఖాళీలు, అర్హతల వివరాలు..
    -మొత్తం 22 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు.
    -ఇంజనీరింగ్/టెక్నాలజీలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో స్పష్టం చేశారు.
    -2019, 20, 21లో పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని ప్రకటనలో తెలిపారు.
    BHEL Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. BHELలో రూ. 70 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

    ఎలా అప్లై చేయాలంటే..
    ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు డిసెంబర్ 2ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 2వ తేదీలోపు www.mhrdnats.gov.in వెబ్ సైట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులు ఈ స్టెప్స్ ను ఫాలో కావాల్సి ఉంటుంది.
    IOCL Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. ఇండియన్ ఆయిల్ లో 527 జాబ్స్.. దరఖాస్తుకు మరో మూడు రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

    -అభ్యర్థులు ముందుగా www.mhrdnats.gov.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
    -అనంతరం Enroll పై క్లిక్ చేయాలి.
    -అప్లికేషన్ ఫామ్ ను సూచించిన వివరాలతో నింపాలి.
    -అనంతరం ప్రతీ అభ్యర్థికి ఒక ప్రత్యేక ఎన్రోల్మెంట్ నంబర్ జనరేట్ అవుతుంది.
    -ఎన్రోల్మెంట్ వెరిఫికేషన్ మరియు అప్రూవల్ కు కనీసం ఒక రోజు సమయం పడుతుంది. ఎన్రోల్మెంట్ నంబర్ జనరేట్ అయిన తర్వాత అభ్యర్థులు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
    UCIL Recruitment 2021: నిరుద్యోగులకు యురేనియం కార్పొరేషన్ శుభవార్త.. రూ. 46 వేల వేతనంతో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

    -అభ్యర్థులు లాగిన్ అయ్యి Resume ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
    -అనంతరం అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
    -అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవాలి.
    -అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Apprenticeship, BSNL, Central Government Jobs, Government jobs, Job notification

    తదుపరి వార్తలు