BSNL: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. స్పెషల్‌గా గ్రాడ్యుయేట్ల కోసమే.. స్టైఫండ్ ఎంతో తెలుసా..?
బీఎస్ఎన్ఎల్లో అప్రెంటీస్ జాబ్స్
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) అప్రెంటిస్‌ల కోసం దరఖాస్తుల (Applications)ను ఆహ్వానిస్తోంది. హర్యానా టెలికాం సర్కిల్లోని బిజినెస్ (Business) ఏరియాలో ఈ నియామకాలను చేపట్టనుంది.
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) అప్రెంటిస్‌ల (Apprentice) కోసం దరఖాస్తుల (Application)ను ఆహ్వానిస్తోంది. హర్యానా టెలికాం సర్కిల్లోని బిజినెస్ (Business) ఏరియాలో ఈ నియామకాలను చేపట్టనుంది. అర్హులైన అభ్యర్థులు బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జులై 19గా నిర్ణయించింది.
హర్యానాలోని అంబాలా, ఫరీదాబాద్, గుర్గావ్, హిస్సార్, కర్నాల్, రేవారీ, రోహ్తక్ జిల్లాల్లో సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగంలో 24 అప్రెంటీస్ పోస్టులు.. సీఎం/సీఎఫ్ఏ/ఈబీ విభాగంలో మరో 20 అప్రెంటిస్ పోస్టులను బీఎస్ఎన్ఎల్ భర్తీ చేయనుంది.
* ఎంపిక ప్రక్రియ
ఫైనల్ పర్సన్టేజ్ లేదా మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్, సెలక్షన్ స్టేటస్‌కు సంబంధించిన వివరాలను ఇమెయిల్ ద్వారా తెలియజేయనున్నారు. ఆగస్టులో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం ఉంది.
* అర్హత ప్రమాణాలు * వయసు
అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థుల వయసు 25 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఓబీసీ, ఎస్సీ-పీడబ్య్లూడీ, ఓబీసీ-పీడబ్ల్యూడీ, ఓసీ- పీడబ్ల్యూడీ కేటగిరి అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
* ఎడ్యుకేషన్
టెక్నికల్ లేదా నాన్-టెక్నికల్ స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు, ఏదైనా స్ట్రీమ్‌లో డిప్లొమా డిగ్రీ చేసి వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* దరఖాస్తు విధానం
స్టెప్-1: నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ అధికారిక పోర్టల్ https://portal.mhrdnats.gov.in/boat/login/user_login.action ద్వారా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకోవాలి.
స్టెప్-2: ఆ తర్వాత అవసరమైన వివరాలను నమోదు చేసి.. సంబంధించిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
స్టెప్-3: జనరేట్ అయిన యూనిక్ ఎన్రోల్మెంట్ నెంబర్‌ను గుర్తించుకోవాలి.
స్టెప్-4: తర్వాత ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. అనంతరం ఎస్టాబ్లిస్ మెంట్ రిక్వెస్ట్ మెనుపై క్లిక్ చేయాలి.
స్టెప్-5: ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ను సెలక్ట్ చేసి, డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి.
స్టెప్-6: ఎస్టాబ్లిస్‌మెంట్ లిస్ట్‌లో బీఎస్ఎన్ఎల్ సెలక్ట్ చేయాలి. తర్వాత అప్లై చేసుకోవాలనుకుంటున్న బిజినెస్ ఏరియాపై క్లిక్ చేయాలి.
స్టెప్-7: చివరగా అప్లికేషన్ ఫారమ్‌ను పూరించి సేవ్ చేసుకోవాలి.
* స్టైఫండ్ వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి అప్రెంటీస్‌కు నెలకు రూ. 8,000 స్టైఫండ్ లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే.. బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటి వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా సైంటిస్ట్, డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజనీర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ - డేటా ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత ఉన్న అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్సైట్ www.bankofbaroda.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 7- 2022గా నిర్ణయించారు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.