బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 285 ఖాళీలను ప్రకటించింది. ఎయిర్‌వింగ్, పారామెడికల్ స్టాఫ్, వెటర్నరీ స్టాఫ్‌ను నియమించుకుంటోంది. ఈ మూడు విభాగాల్లో ఖాళీల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 26 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rectt.bsf.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.
మొత్తం ఖాళీలు- 285
అసిస్టెంట్ ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్- 49
అసిస్టెంట్ రేడియో మెకానిక్- 8
కానిస్టేబుల్- 8
స్టాఫ్ నర్స్- 74
ఏఎస్ఐ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్- 2
ఏఎస్ఐ ల్యాబరేటరీ టెక్నీషియన్- 56
విజిల్- 18
హెచ్‌సీ (వెటర్నరీ)- 40
కానిస్టేబుల్ (కెన్నెల్మ్యాన్)- 30
DRDO Jobs 2021: డీఆర్డీఓలో ఉద్యోగాలు... రేపటిలోగా అప్లై చేయండి
7th Pay Commission: డీఏ పెంపు తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 26
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పూర్తి వివరాలు నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు.
ఎంపిక విధానం- రాతపరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్.
SBI Jobs 2021: డిగ్రీ పాస్ అయ్యారా? ఎస్బీఐలో 6100 ఉద్యోగాలకు అప్లై చేయండి ఇలా
Constable Jobs: టెన్త్ పాస్ అయినవారికి 25,271 కానిస్టేబుల్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
అభ్యర్థులు https://rectt.bsf.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
ఎయిర్‌వింగ్, పారామెడికల్ స్టాఫ్, వెటర్నరీ స్టాఫ్ నోటిఫికేషన్లు వేర్వేరుగా ఉంటాయి.
View Details పైన క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది.
నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత Apply Here పైన క్లిక్ చేయాలి.
మొదటి స్టెప్‌లో వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి.
రెండో స్టెప్‌లో అడ్రస్ వివరాలు ఎంటర్ చేయాలి.
మూడో స్టెప్‌లో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
నాలుగో స్టెప్‌లో క్వాలిఫికేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
ఐదో స్టెప్‌లో వర్క్ ఎక్స్‌పీరియెన్స్ వివరాలు ఎంటర్ చేయాలి.
ఆరో స్టెప్‌లో సర్టిఫికెట్స్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
ఏడో స్టెప్‌లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CAREER, Exams, Government jobs, Govt Jobs 2021, Job notification, JOBS, NOTIFICATION, Upcoming jobs