బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్-BSF మొత్తం 317 ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. వేర్వేరు విభాగాల్లో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. గ్రూప్ బీ, సీలో భర్తీ చేస్తున్న పోస్టులివి. డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఈ ఖాళీ పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ ద్వారా భర్తీ చేస్తుంది. అధికారిక వెబ్‌సైట్స్ http://www.bsf.gov.in/ లేదా http://www.bsf.nic.in/ ఓపెన్ చేసి నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. లేటెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ / రోజ్‌గార్ సమాచార్ పత్రికలో కూడా నోటిఫికేషన్ వివరాలుంటాయి. 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు 2020 మార్చి 15 చివరి తేదీ.
మొత్తం ఖాళీలు- 317
ఎస్ఐ (మాస్టర్)- 5
ఎస్ఐ (ఇంజిన్ డ్రైవర్)- 9
ఎస్ఐ (వర్క్‌షాప్)- 3
హెడ్ కానిస్టేబుల్ (మాస్టర్)- 56
హెడ్ కానిస్టేబుల్ (ఇంజిన్ డ్రైవర్)- 68
మెకానిక్ (డీజిల్ / పెట్రోల్ ఇంజిన్)- 7
ఎలక్ట్రీషియన్- 2
ఏసీ టెక్నీషియన్- 2
ఎలక్ట్రానిక్స్- 1
మెషినిస్ట్- 1
కార్పెంటర్- 1
ప్లంబర్- 2
సీటీ (క్రూ)- 160
నోటిఫికేషన్ విడుదల- 2020 ఫిబ్రవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 15
విద్యార్హత- ఎస్సై పోస్టుకు 12వ తరగతి, హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు 10వ తరగతి, టెక్నికల్ పోస్టులకు ఐటీఐ, డిప్లొమా.
వయస్సు- ఎస్సై పోస్టులకు 22 నుంచి 28 ఏళ్లు, ఇతర పోస్టులకు 20 నుంచి 26 ఏళ్లు.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
DRDO Jobs: హైదరాబాద్ డీఆర్‌డీఓలో ఉద్యోగాలు... మార్చి 14 లాస్ట్ డేట్
APSRTC: ఏపీఎస్‌ఆర్‌టీసీలో 5,000 పైగా అప్రెంటీస్ పోస్టులు... అప్లై చేయండిలా
ISRO Jobs: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని ఇస్రో కేంద్రంలో ఉద్యోగాలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BSF, CAREER, Exams, Job notification, JOBS, NOTIFICATION, Police