హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

BSF Constable Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 2788 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

BSF Constable Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. 2788 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు BSF అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో ఉద్యోగం చేయాలని భావించే యువతకు శుభవార్త. తాజాగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు(Jobs) అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు BSF అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 15న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

BSF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఖాళీ వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య- 2788

అర్హతలు:

అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 2 సంవత్సరాల అనుభవం లేదా ఒకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ITIలో 1 సంవత్సరం డిప్లొమా ఉండాలి.

BMRC Recruitment 2021: నిరుద్యోగులకు అలర్ట్.. బెంగళూరు మెట్రో రైల్ లో జాబ్స్.. దరఖాస్తుకు మరో రెండు రోజులే ఛాన్స్


Physical Standard:

ఎత్తు: పురుషులు- 167.5 సెం.మీ, స్త్రీలు- 157 సెం.మీ.

ఛాతీ (పురుషులకు మాత్రమే): 78-83 సెం.మీ.

షెడ్యూల్డ్ కులాలు / తెగలు / గిరిజనులు..

ఎత్తు: పురుషులు-162.5 సెం.మీ మరియు స్త్రీ-155 సెం.మీ.

ఛాతీ (పురుషులకు మాత్రమే): 76-81 సెం.మీ.

కొండ ప్రాంతాల అభ్యర్థులు..

ఎత్తు: పురుషుడు 165 సెం.మీ మరియు స్త్రీ -150 సెం.మీ.

NHPC Recruitment 2021: డిగ్రీ అర్హతతో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లో జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

వయో పరిమితి:

అభ్యర్థుల వయస్సు పరిమితి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం:

ఎంపికైన అభ్యర్థులకు వేతనంగా రూ.21,700-రూ.69,100 చెల్లించనున్నారు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 15 జనవరి 2022

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 28 ఫిబ్రవరి 2022

AP Wipro Job Mela: హిందూపూర్ విప్రోలో ఖాళీల భర్తీకి రేపే జాబ్ మేళా.. ఇలా రిజిస్టర్ చేసుకోండి

అప్లికేషన్ ఫీజు: ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. వెనుకబడిన తరగతులకు ఉచితం

ఎలా అప్లై చేయాలంటే:

అభ్యర్థులు ఈ లింక్ ద్వారా పోస్ట్‌లకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: BSF, Central Government Jobs, Defence Ministry

ఉత్తమ కథలు