Home /News /jobs /

BSF CONSTABLE RECRUITMENT 2022 APPLICATIONS INVITING FOR 2788 JOB VACANCIES HERE APPLICATION LINK NS

Constable Recruitment 2022: నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) నుంచి పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. దరఖాస్తు ప్రక్రియను అధికారులు ఇటీవల ప్రారంభించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...
    బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF)లో ఉద్యోగం చేయాలని భావించే యువతకు శుభవార్త. తాజాగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు(Jobs) అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు BSF అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ఈ నెల 15న ప్రారంభమైంది. దరఖాస్తుకు ఫిబ్రవరి 28ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

    BSF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఖాళీ వివరాలు:
    మొత్తం పోస్టుల సంఖ్య- 2788
    అర్హతలు:
    అభ్యర్థి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 2 సంవత్సరాల అనుభవం లేదా ఒకేషనల్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ITIలో 1 సంవత్సరం డిప్లొమా ఉండాలి.
    Govt Jobs 2022: ఈ వారం మీరు అప్లై చేయాల్సిన టాప్ 5 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

    Physical Standard:
    ఎత్తు: పురుషులు- 167.5 సెం.మీ, స్త్రీలు- 157 సెం.మీ.
    ఛాతీ (పురుషులకు మాత్రమే): 78-83 సెం.మీ.
    షెడ్యూల్డ్ కులాలు / తెగలు / గిరిజనులు..
    ఎత్తు: పురుషులు-162.5 సెం.మీ మరియు స్త్రీ-155 సెం.మీ.
    ఛాతీ (పురుషులకు మాత్రమే): 76-81 సెం.మీ.
    కొండ ప్రాంతాల అభ్యర్థులు..
    ఎత్తు: పురుషుడు 165 సెం.మీ మరియు స్త్రీ -150 సెం.మీ.
    Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త.. నేషనల్ హెల్త్ మిషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నెలకు రూ. 36 వేల వేతనం

    వయో పరిమితి:
    అభ్యర్థుల వయస్సు పరిమితి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
    వేతనం:
    ఎంపికైన అభ్యర్థులకు వేతనంగా రూ.21,700-రూ.69,100 చెల్లించనున్నారు.
    ముఖ్యమైన తేదీలు:
    ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ - 15 జనవరి 2022
    ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ - 28 ఫిబ్రవరి 2022
    IOCL Recruitment 2022: నిరుద్యోగులకు IOCL శుభవార్త.. 626 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి

    అప్లికేషన్ ఫీజు: ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. వెనుకబడిన తరగతులకు ఉచితం



    ఎలా అప్లై చేయాలంటే:
    అభ్యర్థులు ఈ లింక్ ద్వారా పోస్ట్‌లకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులు ఈ లింక్ ద్వారా అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు.
    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Central Government Jobs, Job notification, JOBS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు