BSF Constable Jobs 2021: రూ.69,100 వేతనంతో బీఎస్‌ఎఫ్‌లో 269 కానిస్టేబుల్ ఉద్యోగాలు... టెన్త్ పాస్ అయితే చాలు

BSF Constable Jobs 2021: రూ.69,100 వేతనంతో బీఎస్‌ఎఫ్‌లో 269 కానిస్టేబుల్ ఉద్యోగాలు... టెన్త్ పాస్ అయితే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

BSF Constable Recruitment 2021 | కానిస్టేబుల్ ఉద్యోగాలు కోరుకునేవారికు గుడ్ న్యూస్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్- BSF కానిస్టేబుల్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి.

  • Share this:
    బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్- BSF ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ సీలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 269 ఖాళీలు ఉన్నాయి. నియామక ప్రక్రియ పూర్తయ్యేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. యువతీయువకులు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు 2021 ఆగస్ట్ 9న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 22 చివరి తేదీ. స్పోర్ట్స్ కోటాలో తాత్కాలికంగా భర్తీ చేస్తున్న పోస్టులు. పర్మనెంట్ చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rectt.bsf.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

    HURL Recruitment 2021: నెలకు రూ.50,000 జీతంతో 513 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    UPSC Recruitment 2021: రూ.1,50,000 వరకు జీతంతో కేంద్ర హోమ్ శాఖలో జాబ్స్

    BSF Constable Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే


    మొత్తం ఖాళీలు- 269
    బాక్సింగ్ (మెన్)- 10
    బాక్సింగ్ (వుమెన్)- 10
    జూడో (మెన్)- 8
    జూడో (వుమెన్)- 8
    స్విమ్మింగ్ (మెన్)- 12
    స్విమ్మింగ్ (వుమెన్)- 4
    క్రాస్ కంట్రీ (మెన్)- 2
    క్రాస్ కంట్రీ (వుమెన్)- 2
    కబడ్డీ (మెన్)- 10
    వాటర్ స్పోర్ట్స్ (మెన్)- 10
    వాటర్ స్పోర్ట్స్ (వుమెన్)- 6
    వుషూ (మెన్)- 11
    జిమ్నాస్టిక్స్ (మెన్)- 8
    హాకీ (మెన్)- 8
    వెయిట్ లిఫ్టింగ్ (మెన్)- 8
    వెయిట్ లిఫ్టింగ్ (వుమెన్)- 9
    వాలీబాల్ (మెన్)- 10
    రెజ్లింగ్ (మెన్)- 12
    రెజ్లింగ్ (వుమెన్)- 10
    హ్యాండ్ బాల్ (మెన్)- 8
    బాడీ బిల్డింగ్ (మెన్)- 6
    ఆర్చరీ (మెన్)- 8
    ఆర్చరీ (వుమెన్)- 12
    తైక్వాండో (మెన్)- 10
    అథ్లెటిక్స్ (మెన్)- 20
    అథ్లెటిక్స్ (వుమెన్)- 25
    ఈక్వెస్ట్రియన్ (మెన్)- 2
    షూటింగ్ (మెన్)- 3
    షూటింగ్ (వుమెన్)- 3
    బాస్కెట్ బాల్ (మెన్)- 6
    ఫుట్‌బాల్ (మెన్)- 8

    Post Office Jobs: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలకు అప్లై చేసినవారికి అలర్ట్... ఆ జాబ్ నోటిఫికేషన్ నిలిపివేసిన ఇండియా పోస్ట్

    RRB Group D Jobs: నిరుద్యోగులకు అలర్ట్... 1,03,769 రైల్వే ఉద్యోగాలకు త్వరలో ఎగ్జామ్

    BSF Constable Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


    దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 9
    దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 22
    విద్యార్హతలు- గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి 10వ తరగతి పాస్ కావాలి.
    స్పోర్ట్స్ క్వాలిఫికేషన్- ఛాంపియన్‌షిప్, నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో పాల్గొన్నవారు, మెడల్స్ సాధించినవారు దరఖాస్తు చేయొచ్చు.
    వయస్సు- 2021 ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 23 ఏళ్లు.
    వేతనం- రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం లభిస్తుంది.
    ఎత్తు- పురుషులు 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్లు
    ఎంపిక విధానం- డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్.
    Published by:Santhosh Kumar S
    First published: