కానిస్టేబుల్ జాబ్ (Constable Jobs) కోరుకునేవారికి గుడ్ న్యూస్. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF Jobs) గ్రూప్ సీలో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 269 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టుల సంఖ్య తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. నియామక ప్రక్రియ ముగిసే నాటికి పోస్టుల సంఖ్యను నిర్ణయిస్తోంది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF). ఈ పోస్టులకు యువతీయువకులు అప్లై చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 సెప్టెంబర్ 22 చివరి తేదీ. ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న తాత్కాలిక పోస్టులు మాత్రమే. భవిష్యత్తులో ఉద్యోగాలను పర్మనెంట్ చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
మొత్తం ఖాళీలు | 269 |
బాక్సింగ్ (మెన్) | 10 |
బాక్సింగ్ (వుమెన్) | 10 |
జూడో (మెన్) | 8 |
జూడో (వుమెన్) | 8 |
స్విమ్మింగ్ (మెన్) | 12 |
స్విమ్మింగ్ (వుమెన్) | 4 |
క్రాస్ కంట్రీ (మెన్) | 2 |
క్రాస్ కంట్రీ (వుమెన్) | 2 |
కబడ్డీ (మెన్) | 10 |
వాటర్ స్పోర్ట్స్ (మెన్) | 10 |
వాటర్ స్పోర్ట్స్ (వుమెన్) | 6 |
వుషూ (మెన్) | 11 |
జిమ్నాస్టిక్స్ (మెన్) | 8 |
హాకీ (మెన్) | 8 |
వెయిట్ లిఫ్టింగ్ (మెన్) | 8 |
వెయిట్ లిఫ్టింగ్ (వుమెన్) | 9 |
వాలీబాల్ (మెన్) | 10 |
రెజ్లింగ్ (మెన్) | 12 |
రెజ్లింగ్ (వుమెన్) | 10 |
హ్యాండ్ బాల్ (మెన్) | 8 |
బాడీ బిల్డింగ్ (మెన్) | 6 |
ఆర్చరీ (మెన్ | 8 |
ఆర్చరీ (వుమెన్) | 12 |
తైక్వాండో (మెన్) | 10 |
అథ్లెటిక్స్ (మెన్) | 20 |
అథ్లెటిక్స్ (వుమెన్) | 25 |
ఈక్వెస్ట్రియన్ (మెన్) | 2 |
షూటింగ్ (మెన్) | 3 |
షూటింగ్ (వుమెన్) | 3 |
బాస్కెట్ బాల్ (మెన్) | 6 |
ఫుట్‌బాల్ (మెన్) | 8 |
దరఖాస్తు ప్రారంభం- 2021 ఆగస్ట్ 9
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 22
విద్యార్హతలు- గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ నుంచి 10వ తరగతి పాస్ కావాలి.
స్పోర్ట్స్ క్వాలిఫికేషన్- ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్, అంతర్జాతీయ క్రీడోత్సవాల్లో పాల్గొన్నవారు, మెడల్స్ సాధించినవారు దరఖాస్తు చేయొచ్చు.
వయస్సు- 2021 ఆగస్ట్ 1 నాటికి 18 నుంచి 23 ఏళ్లు.
వేతనం- రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం లభిస్తుంది.
ఎత్తు- పురుషులు 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్లు
ఎంపిక విధానం- డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్
ఈ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Step 1- అభ్యర్థులు ముందుగా https://rectt.bsf.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో Apply Here పైన క్లిక్ చేయాలి.
Step 3- మొదటి సెక్షన్లో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.
Step 4- రెండో సెక్షన్లో అడ్రస్ వివరాలు ఎంటర్ చేయాలి.
Step 5- మూడో సెక్షన్లో ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
Step 6- నాలుగో సెక్షన్లో విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
Step 7- ఐదో సెక్షన్లో ఎక్స్‌పీరియెన్స్ వివరాలు ఎంటర్ చేయాలి.
Step 8- ఆరో సెక్షన్లో సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి.
Step 9- చివరగా దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BSF, CAREER, Govt Jobs 2021, Job notification, JOBS