బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్‌లో పలు విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. గ్రూప్ సి విభాగంలోకి వచ్చే ఈ పోస్టులకు ఆన్‌లైన్ (Online) ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు జీతం ఇవ్వబడుతుంది. కాగా, ఏఎస్‌ఐ పోస్టుకు రూ.29200 నుంచి రూ.92300, హెచ్‌సీ పోస్టుకు రూ.25500 నుంచి రూ.81100 వరకు జీతం ఇవ్వనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 29, 2021 వరకు అవకాశం ఉంది. నోటిఫికేషన్, దరఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/#bsf-current-openings ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు.. అర్హతలు
పోస్టు పేరు | ఖాళీలు | అర్హతలు | జీతం |
కానిస్టేబుల్ (సీవర్‌మ్యాన్) | 2 | అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. | రూ.21700 నుంచి రూ.69100 |
కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్) | 24 | అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. | రూ.21700 నుంచి రూ.69100 |
కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్) | 28 | అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. | రూ.21700 నుంచి రూ.69100 |
కానిస్టేబుల్ (లైన్‌మన్) | 11 | అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. | రూ.21700 నుంచి రూ.69100 |
ఏఎస్‌ఐ | 1 | గుర్తింపు పొందిన యూనివర్సిటీలో పదో తరగతి పాసై ఉండాలి. సివిల్‌లో డిప్లమా కోర్సు, డ్రాఫ్ట్‌మెన్‌షిప్ చేసి ఉండాలి.వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. | రూ.29200 నుంచి రూ.92300 |
హెచ్‌సీ | 6 | అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. | రూ.25500 నుంచి రూ.81100 |
ఎంపిక విధానం..
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
GMRC Recruitment: జీఎంఆర్‌సీలో 118 కాంట్రాక్టు ఉద్యోగాలు.. అప్లికేషన్ ప్రాసెస్, వేతనం వివరాలు
- కెటగిరీల వారీగా అర్హత మార్కులు సాధించాలి.
- ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
- అనంతరం ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PHYSICAL STANDARDS TEST) నిర్వహిస్తారు.
- ఇవ్వన్ని ఉత్తీర్ణత సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం..
Step 1 : దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో ఉంటుంది.
Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/#bsf-current-openings ను సందర్శించాలి.
ESIC Recruitment 2021: ఈఎస్ఐసీలో 1,120 ఉద్యోగాలు.. జీతం రూ.56,100.. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్
Step 3 : అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4 : నోటిఫికేషన్ చదవిన తరువాత Apply Here క్లిక్ చేయాలి.
Step 5 : అనంతరం https://rectt.bsf.gov.in/registration/basic-details?guid=3d4da058-cf5b-12eb-bafc-fc017s9a1ba9 లింక్‌లోకి వెళ్లాలి.
Step 6 : అవసరం అయిన సమాచారం అందించి దరఖాస్తు నింపాలి.
Step 7 : దరఖాస్తు పూర్తి చేసిన తరువాతం అప్లికేషన్ ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
Step 8 : దరఖాస్తుకు డిసెంబర్ 29, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BSF, Govt Jobs 2021, Job notification, JOBS