ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నేతల వసూళ్లు.. నాలుగు జిల్లాలకు పాకిన దందా

రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఆర్ఎఫ్సీఎల్) కొంతమంది దళారులకు కాసుల వర్షం కురిపి స్తోంది. సంస్థను పునరుద్ధరిస్తున్న తరుణంలో ఉద్యో గాల పేరిట నిరుద్యోగులకు కొందరు వల విసురుతున్నారు. ఒక్కో పోస్టుకు రూ .2 లక్షల నుంచి రూ .5 లక్షల వరకు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

news18-telugu
Updated: November 21, 2020, 2:34 PM IST
ఆ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నేతల వసూళ్లు.. నాలుగు జిల్లాలకు పాకిన దందా
RFCL కంపెనీ
  • Share this:
రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ (ఆర్ఎఫ్సీఎల్) కొంతమంది దళారులకు కాసుల వర్షం కురిపి స్తోంది. సంస్థను పునరుద్ధరిస్తున్న తరుణంలో ఉద్యో గాల పేరిట నిరుద్యోగులకు కొందరు వల విసురుతున్నారు. ఒక్కో పోస్టుకు రూ .2 లక్షల నుంచి రూ .5 లక్షల వరకు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకు కొంతమంది చోటా మోటా లీడర్లు సూత్రధారులుగా వ్యవహరిస్తుండగా, ఈ దందా నాలుగు జిల్లాలకు వ్యాపించడం గమనార్హం. దశాబ్ధాల తర్వాత ఆర్ఎఫ్సీఎల్ ను పునరుద్ధరిస్తుండడం తెలిసిందే. అయితే అది ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. పనుల్లో జాప్యం కారణంగా వాయిదా పడుతూ వస్తోంది . ఇదే అదనుగా కొంతమంది దళారుల ఉద్యోగాల దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు నేరుగా ఆన్లైన్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుండగా, సెమీస్కిల్డ్, అన్ స్కిల్డ్ పోస్టులను మాత్రం స్థానికంగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇది విభాగాల వారీగా కాంట్రాక్టర్లకు అప్పగించి, వారి ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగులను భర్తీ చేస్తారు. అయితే ఆర్ఎఫ్సీఎల్ లో కాంట్రాక్ట్ పద్ధతిన ప్రవేశించినా.. తర్వాత రెగ్యులరైజ్ అవుతుందనే నమ్మకంతో వేలాది మంది నిరుద్యోగులు పైరవీకారులను ఆశ్రయిస్తున్నారు.

ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలకు చెందిన చోటామోటా నాయకులు ఉద్యోగాలు పెట్టిస్తామంటూ రంగప్రవేశం చేశారు. లొకాలిటీ, పోస్టు స్థాయి బట్టి రూ .2 లక్షల నుంచి రూ .5 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇందులో అన్ స్కిల్డ్ పోస్టులే అధికంగా ఉన్నాయి. తమ భవిష్యత్ కు భరోసా ఉంటుందనే ఆశతో లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ నిరుద్యోగులు దళారులకు చెల్లిస్తున్నారు. అయితే.. ఉద్యోగాల మాటేమో కానీ ఇచ్చిన డబ్బులు కూడా నష్టపోయే ప్రమాదం ఏర్పడింది . ఉద్యోగాల దందా పేరిట మీడియా లో కథనాలు వస్తుండడంతో తాము మోసపోయామనే ఆందోళనతో ఇచ్చిన డబ్బుల కోసం ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఫ్యాక్టరీ ప్రారంభం నాటికి ఉద్యోగాలు ఇప్పిస్తామని.. బయట ప్రచారాన్ని నమ్మొద్దంటూ దళారులు మోసాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. వీరంతా ఆయా పార్టీల్లో కిందిస్థాయి నాయకులు కావడంతో నిరుద్యోగులు ఇంకా మోసపోతూనే ఉన్నారు.

పక్క జిల్లాలకూ పాకిన దందా..
పెద్దపల్లి జిల్లాలో నిర్మిస్తున్న ఆర్ఎఫ్సీఎల్ లో ఉద్యోగాల పేరిట దళారులు సాగిస్తున్న దందా పక్క జిల్లాలకు కూడా విస్తరించింది. కరీంనగర్, జగిత్యాల, జయశంకర్ భూపాల పల్లి, మంచిర్యాల తదితర జిల్లాల్లో బాధితుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. లక్షలాది రూపాయలు దళారుల చేతుల్లో పోసి నిరుద్యోగులు వాళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఉద్యో గాలు రాకపోగా.. ఉన్న డబ్బులు కూడా పోయే పరిస్థితి నెల కొనడంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్ఎఫ్సీఎల్ లో ఉద్యోగాల పేరిట కొనసాగుతున్న వసూళ్లకు పుల్ స్టాప్ పడడం లేదు. పైరవీలకు అవకాశం లేదంటూ అధికారులు చెబుతున్నా.. అవి పెద్దగా ప్రభావం చూపడం లేదు. దళారుల దందా ఆగడం లేదు. ఇప్పటికంగా దళారులను గుర్తించి వారిపై చట్టప రంగా కఠిన చర్యలు తీసుకోవాలని, ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Published by: Nikhil Kumar S
First published: November 21, 2020, 2:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading