Home /News /jobs /

BROADCAST ENGINEERING CONSULTANTS INDIAN LIMITED HAS RELEASED A NOTIFICATION FOR FILLING VARIOUS POSTS KNOW DETAILS HERE VB

BECIL Recruitment 2022: బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లో ఉద్యోగాలు.. జీతం రూ.75 వేలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (BECIL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఆగస్టు 31, 2022గా పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియన్ లిమిటెడ్ (BECIL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదల చేశారు. మెడికల్ ఆఫీసర్, PRO, స్టాఫ్ నర్స్(Staff Nurse) అండ్ ఇతర 54 పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 31, 2022. ఆసక్తి గల అభ్యర్థులు www.becil.com అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌(Online) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 54 పోస్టులను ఈ నోటిఫికేషన్(Notification) ద్వారా భర్తీ చేయనున్నారు. ఏ విభాగంలో ఏ ఏ పోస్టలు ఉన్నాయి.. జీతం(Salary), వయోపరిమితి(Age), అర్హతలాంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Jobs In Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. ఆరోగ్య శాఖలో పలు పోస్టులకు నోటిఫికేషన్..


ఖాళీలు వివరాలు ఇలా..































































పోస్టు పేరుఖాళీల సంఖ్య
మెడికల్ ఆఫీసర్06
మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం)02
సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్)01
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO)01
జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్)02
ప్రోగ్రామ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేటివ్)01
యోగా థెరపిస్ట్02
స్టాఫ్ నర్స్12
పంచకర్మ టెక్నీషియన్13
ఆడియాలజిస్ట్01
ఆప్తాల్మిక్ టెక్నీషియన్/ ఆప్టోమెట్రిస్ట్01
OT టెక్నీషియన్ (ఆఫ్తాల్మిక్)01
అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్01
పంచకర్మ అటెండెంట్10



దరఖాస్తు రుసుము..
జనరల్/ఓబీసీ/ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళల కేటగిరీ అభ్యర్థులు రూ.750 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్ కేటగిరీ కిందకు వచ్చేవారు రూ.450 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అర్హత, వయోపరిమితి ఇలా..
మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం), సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్), పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO), జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్), ప్రోగ్రామ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేటివ్), యోగా థెరపిస్ట్, స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్ లో డిగ్రీ లేదా పీజీ పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 45 సంవత్సరాలు. ఆడియాలజిస్ట్, ఆప్తాల్మిక్ టెక్నీషియన్/ ఆప్టోమెట్రిస్ట్ మరియు OT టెక్నీషియన్ (ఆఫ్తాల్మిక్) పోస్టులకు వయోపరిమితి 35 సంవత్సరాలుగా నిర్ణయించారు.
పంచకర్మ టెక్నీషియన్, అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్ మరియు పంచకర్మ అటెండెంట్ పోస్టులకు వయోపరిమితి 30 సంవత్సరాలు.

ఎలా దరఖాస్తు చేయాలి..

Step 1. ముందుగా BECIL యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. దాని కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Step 2. ఇక్కడ కనిపిస్తున్న కెరీర్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 3. దీనిలో మీకు సంబంధించి జాబ్ కేటగిరీని ఎంచుకోండి.

Step 4. తర్వాత రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ ను ఎంచుకోండి. దానికి డైరెక్ట్ లింక్ ఇదే.

Step 5. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారమ్ ను సబ్ మిట్ చేయాలి.

Step 6: చివరగా దరఖాస్తు ఫారమ్ ను డౌన్ లోడ్ చేసుకొని.. భవిష్యత్ అవసరాల కొరకు దగ్గర ఉంచుకోండి.

జీతం..
మెడికల్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేదం), మరియు సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్) పోస్టులకు జీతం రూ. 75,000. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (PRO) పోస్టుకు జీతం రూ. 70,000. జూనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ (టెక్నికల్), ప్రోగ్రామ్ మేనేజర్ (అడ్మినిస్ట్రేటివ్) మరియు యోగా థెరపిస్ట్‌లకు జీతం రూ. 50,000. స్టాఫ్ నర్స్ - రూ.37,500, పంచకర్మ టెక్నీషియన్- రూ. 24,000, ఆడియాలజిస్ట్- రూ. 21,756, ఆప్తాల్మిక్ టెక్నీషియన్/ ఆప్టోమెట్రిస్ట్- రూ. 21,756 మరియు OT టెక్నీషియన్ (ఆఫ్తాల్మిక్)- రూ. 21,756, అసిస్టెంట్ లైబ్రరీ ఆఫీసర్-రూ. 30,000 మరియు పంచకర్మ అటెండెంట్- రూ. 16,000 చెల్లించనున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government, Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు