BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 53 జాబ్స్

BECIL Recruitment 2019 | దరఖాస్తుకు అక్టోబర్ 25 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలున్నాయి.

news18-telugu
Updated: October 10, 2019, 3:17 PM IST
BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 53 జాబ్స్
BECIL Jobs: బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్‌లో 53 జాబ్స్ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 10, 2019, 3:17 PM IST
బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL పలు ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. కొద్ది రోజుల క్రితమే రేడియోగ్రాఫర్, లిఫ్ట్ ఆపరేటర్, పేషెంట్ కేర్ మేనేజర్, పేషెంట్ కేర్ కో-ఆర్డినేటర్ లాంటి 35 పోస్టుల భర్తీకి ఓ నోటిఫికేషన్ జారీ చేసింది బీఈసీఐఎల్. ఆ నోటిఫికేషన్ వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మరో 53 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు అక్టోబర్ 25 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతలున్నాయి. బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

BECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం ఖాళీలు- 53

ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్- 45
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్- 08
దరఖాస్తు ప్రారంభం- 2019 అక్టోబర్ 09


దరఖాస్తుకు చివరి తేదీ- 2019 అక్టోబర్ 25
Loading...
దరఖాస్తు విధానం- బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్‌సైట్‌లో http://www.becil.com/ ఓపెన్ చేసి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు పూర్తి చేసి సంబంధిత డాక్యుమెంట్లతో BECIL కార్యాలయంలో సబ్మిట్ చేయాలి.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రెడ్‌మీ 8 ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Railway Jobs: మొత్తం 3,500 పైగా రైల్వే జాబ్స్... ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేశారా?

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు

Railway Jobs: వాయువ్య రైల్వేలో ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే
First published: October 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...