BECIL Jobs: 2,684 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు

BECIL Recruitment 2019 | ఎక్కువగా స్కిల్డ్, అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులే ఉన్నాయి. వీరంతా ప్రభుత్వానికి చెందిన ప్రాజెక్టుల్లో పనిచేయాలి.

news18-telugu
Updated: August 13, 2019, 12:17 PM IST
BECIL Jobs: 2,684 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు
BECIL Jobs: 2,684 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పొడిగింపు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 13, 2019, 12:17 PM IST
మొత్తం 2,684 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన బ్రాడ్‌క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్-BECIL దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూలై 10న ప్రారంభమైంది. మొదట నోటిఫికేషన్ ప్రకారం 2019 జూలై 25 దరఖాస్తుకు చివరి తేదీ. కానీ దరఖాస్తు గడువును పొడిగిస్తూ మరో నోటిఫికేషన్ జారీ చేసింది BECIL. 2,684 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఆగస్ట్ 16 వరకు అవకాశం ఇచ్చింది. ఈ ఖాళీల్లో ఎక్కువగా స్కిల్డ్, అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులే ఉన్నాయి. వీరంతా ప్రభుత్వానికి చెందిన ప్రాజెక్టుల్లో పనిచేయాలి. దరఖాస్తు తేదీ పొడిగిస్తూ BECIL జారీ చేసిన సవరణ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

BECIL Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలు ఇవే...


దరఖాస్తు ప్రారంభం- 2019 జూలై 10

దరఖాస్తు ముగింపు- 2019 ఆగస్ట్ 16
మొత్తం పోస్టులు- 2,684
స్కిల్డ్ మ్యాన్‌పవర్- 1,336


అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్- 1,342
Loading...
కన్సల్టెంట్- 4
అకౌంట్స్ ఎగ్జిక్యూటీవ్- 2
అర్హత: స్కిల్డ్ మ్యాన్‌పవర్ పోస్టులకు ఇంజనీరింగ్‌లో ఐటీఐ లేదా హయ్యర్ టెక్నికల్ డిగ్రీ డిప్లొమా పాసై ఉండాలి. అన్‌స్కిల్డ్ మ్యాన్ పవర్ పోస్టులకు 8వ తరగతి పాసైతే చాలు.
ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం రూ.250.
వేతనం: స్కిల్డ్ మ్యాన్‌పవర్ ఉద్యోగులకు రూ.9,381, అన్‌స్కిల్డ్ మ్యాన్‌పవర్ ఉద్యోగులకు రూ.7,613, కన్సల్టెంట్ పోస్టులకు రూ.30,000-రూ.50,000, అకౌంట్స్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు రూ.20,000-రూ.30,000 ఉంటుంది.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Realme X: స్మార్ట్‌ఫోన్‌తో ఫ్యాషన్‌ ఫోటోగ్రఫీ... అదిరిపోయిన ఫోటోలు


ఇవి కూడా చదవండి:

Coast Guard Jobs: ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో యాంత్రిక్ ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా...

SAIL Jobs: స్టీల్ అథారిటీలో 361 ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలు ఇవే

Andhra Bank Jobs: ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగాలు... 10వ తరగతి పాసైతే చాలు
First published: August 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...