Home /News /jobs /

BRO RECRUITMENT 2022 BORDER ROADS ORGANIZATION RECRUITMENT 2022 APPLY FOR 246 POSTS KNOW APPLICATIN PROCESS HERE VB

BRO Recruitment 2022: 10వ తరగతి,ఇంటర్,ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు.. మొత్తం 246 పోస్టులు.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

BRO Recruitment 2022: 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన వారికి శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్  పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
10వ తరగతి, ఇంటర్, ఐటీఐ పూర్తి చేసిన వారికి శుభవార్త. బోర్డర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్  పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో  డ్రాఫ్ట్స్‌మన్, సూపర్‌వైజర్, సూపర్‌వైజర్ సైఫర్, సూపర్‌వైజర్ స్టోర్స్, హిందీ టైపిస్ట్(Hindi Typist), ఆపరేటర్(Operator), ఎలక్ట్రీషియన్, వెల్డర్, మల్టీ స్కిల్డ్ వర్కర్ వంటి వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ను ప్రచురించింది. ఈ పోస్టులకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ క్రింది సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు సెప్టెంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఆగస్టు 11న  విడుదలైంది.

RRB Group D First Day Questions: మొదటి రోజు రైల్వే గ్రూప్ డీ పరీక్ష ప్రశాంతం.. ప్రశ్నల సరళి ఇలా..


సంస్థ పేరు:   బోర్డర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ పోస్టుల సంఖ్య మొత్తం 246 పోస్టులు

14 డ్రాఫ్ట్స్‌మన్ పోస్టులు, 7 సూపర్‌వైజర్ పోస్టులు, 13 సూపర్‌వైజర్ సైఫర్ పోస్టులు, 9 సూపర్‌వైజర్ స్టోర్ పోస్టులు, 10 హిందీ టైపిస్ట్ పోస్టులు, 35 కమ్యునిక్ ఆపరేటర్ పోస్టులు. , 30 ఎలక్ట్రీషియన్ పోస్టులు, 24 వెల్డర్ పోస్టులు, 22 మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులు మరియు 82 మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.



విద్యార్హతలు..

మల్టీ స్కిల్డ్ వర్కర్ (మేషన్): SSLC, బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

మల్టీ స్కిల్డ్ వర్కర్ (నర్సింగ్ అసిస్టెంట్): ఇంటర్  సైన్స్‌తో పాటు ఏడాది నర్సింగ్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.

మల్టీ స్కిల్డ్ వర్కర్ (డ్రైవర్ ఇంజిన్ స్టాటిక్): పోస్టుకు సంబంధించిన ట్రేడ్‌లో ఐటీఐతోపాటు ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఉత్తీర్ణులై ఉండాలి.

స్టోర్ కీపర్ టెక్నికల్: ఏదైనా సబ్జెక్టులో పీయూసీతో స్టోర్ కీపింగ్ అనుభవం ఉండాలి.
ఇతర పోస్టులకు కూడా ఎస్‌ఎస్‌ఎల్‌సీతోపాటు ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ ను చూడండి.

ఎంపిక ప్రక్రియ..రాత పరీక్ష, శారీరక కొలత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా జరుగుతుంది.

వయోపరిమితి:  కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 27 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది..?

అభ్యర్థులు నిర్ణీత అర్హతలలో పొందిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడతారు, ఒరిజినల్  పత్రాలను తనిఖీ చేసి ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల ప్రక్రియ ఇలా.. 

-ముందుగా అధికారికి వెబ్ సైట్ ను సందర్శించాలి.

-వెబ్ సైట్ లో వాట్స్ న్యూ అనే ఆప్షన్ లో స్క్రోల్ అవుతున్న వివరాల్లో ఈ నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి

-అందులో వివరాలను చదువుకొని.. అర్హత ప్రమాణాలు ఉంటే.. అప్లికేషన్ ఫారమ్ ను ప్రింట్ తీసుకోవాలి.

-దానిలో వివరాలను నమోదు చేసి.. నిర్ణీత గడువు లోగా దరఖాస్తులను పోస్ట్ చేయాల్సి ఉంటంది. చిరునామాకు సంబంధించి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Published by:Veera Babu
First published:

Tags: Bro recruitment, Career and Courses, Central Government Jobs, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు