ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్(Good News). బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 327 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 11, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ bro.gov.inని సందర్శించి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు ఇలా..
మొత్తం: 327 పోస్ట్లు
మల్టీ స్కిల్డ్ వర్కర్ (కుక్): 133 పోస్టులు
ఆపరేటర్ (కమ్యూనికేషన్): 46 పోస్టులు.
ఎలక్ట్రీషియన్: 43 పోస్టులు
మల్టీ స్కిల్డ్ వర్కర్ (బ్లాక్ స్మిత్): 27 పోస్టులు
వెల్డర్: 24 పోస్టులు
డ్రాఫ్ట్స్మన్: 16 పోస్ట్లు
సూపర్వైజర్ స్టోర్: 13 పోస్టులు
హిందీ టైపిస్ట్: 10 పోస్టులు
సూపర్వైజర్ సైఫర్: 9 పోస్ట్లు
సూపర్వైజర్ (అడ్మినిస్ట్రేషన్): 7 పోస్టులు
వయో పరిమితి..
జనరల్ యొక్క వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయో పరిమితి, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.
అర్హత
ఈ పోస్టులన్నింటికీ దరఖాస్తు చేసుకోవడానికి వేర్వేరు అర్హతలు నిర్దేశించబడ్డాయి. పది, ఇంటర్, డిగ్రీ అర్హతలతో వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఉద్యోగ నోటిఫికేషన్..
శివాజీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్ ప్రకారం.. వివిధ విభాగాల్లో మొత్తం 101 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ colrec.uod.ac.inని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషల్లో పేర్కొన్న ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం అయంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 7, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
నోటిఫికేషన్ పీడీఎఫ్ కొరకు ఇక్కడ క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Recruitment