టెన్త్, ఇంటర్ పాసైనవారికి శుభవార్త. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్-BRO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 459 ఖాళీలను ప్రకటించింది. జనరల్ రిజర్వ్ ఇంజనీరింగ్ ఫోర్స్‌లో మొత్తం 7 ట్రేడ్స్‌లో ఈ ఖాళీలున్నాయి. కేవలం పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 4 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అధికారిక వెబ్సైట్ http://bro.gov.in/ లో చూడొచ్చు. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. http://bro.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసి, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి, నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 ఏప్రిల్ 4
విద్యార్హతలు- టెన్త్, ఇంటర్, డిగ్రీ
ఎంపిక విధానం- రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్
వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్-
Commandant GREF Centre,
Dighi Camp,
Pune 411015.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.